సుకుమార్ నిత్యమీనన్ ఎం చేయబోతున్నారో తెలుసా..

క్యూట్‌ గ్లామర్‌తో యూత్‌ని ఎట్రక్ట్‌ చేసే టాలెంట్‌ నిత్యామీనన్‌ది. యూత్‌ ఎట్రాక్షనే కాదు.. ఏ తరహా నటనైనా అవలీలగా చేసేసే సత్తా ఈ ముద్దుగుమ్మది. హైట్‌లో షార్ట్‌ గానీ, నటనలో టాప్‌. నేచురల్‌ నటన, ఫ్రీ డైలాగ్‌ డెలీవరీ, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌ ఈ ముద్దుగుమ్మకే సొంతం. అంతేకాదు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోగలదు. అవకాశం ఇస్తే పాటలు కూడా పాడెయ్యగలదు. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా ప్రయోగాత్మక చిత్రాలు చేసేసింది. తాజాగా, సుకుమార్‌ నిర్మాణంలో తెరక్కెబోతోన్న ఒక సినిమాలో నిత్య దయ్యంలా కనిపిపించి భయపెట్టనుందట.

‘కుమారి 21ఎఫ్‌’ సినిమాతో సుకుమార్‌ తొలిసారిగా నిర్మాతగా మారాడు. ఆ సినిమా కథ యూత్‌కి చాలా దగ్గరయ్యింది. యూత్‌ని ఆలోచింపచేసేలా చేసింది. ఓ పక్క దర్శకుడిగా సెన్సేషనల్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తూ, ఇంకోపక్క నిర్మాతగానూ విలక్షణ సినిమాల్ని చేస్తున్న సుకుమార్‌ తాజాగా మరో సినిమాకి నిర్మాణం వహించబోతున్నాడట. ఈ సినిమా ద్వారా సుక్కు కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేయనున్నాడట. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిత్యామీనన్‌ దయ్యం గెటప్‌లో అందంగా భయపెట్టబోతోందట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి డిస్కర్షన్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. టాలీవుడ్‌లో థ్రిల్లర్‌ సినిమాలకి మంచి గిరాకీ ఉంది. అందుకే సుకుమార్‌ ఈ జోనర్‌లో సినిమా చేయాలనుకున్నాడట.