సీఎం ని కదిలించిన చిన్నారి.

కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించి ప్రచురితమైన మానవీయ కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు.

తమ చిన్నారి కూతురు జ్ఞానసాయి కి  కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు ని ఆశ్రయించిన తల్లి దండ్రులు గోడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించించింది . జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.అంతే కాకుండా చికిత్స కూడా హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రిలో జరిగేలా అధికారులను ఆయన ఆదేశించారు.ఈ చిన్నారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు రూ.30 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులకు కూడా మెరుగైన చికిత్సను అందించాలని ఆయన ఆదేశించారు