రవితేజ కి ఏమైంది!!

ఒకప్పుడు రవితేజా అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఆ వేగమే రవితేజా ని సరైన ఆలోచన లేకుండా ఏదొఇపడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ తిన్నాయి. దీంతో రేసులో బాగా వెనకబడిపోయాడు మాస్ రాజా. మరీ డల్ అయిపోయిన టైం లో వచ్చిన “బలుపు” మంచి బూస్ట్ నిచ్చించింది. ఇక అప్పటినుంచీ దూకుడు కాస్త తగ్గించినా మరీ పెద్దగా మార్పు రాలేదు.

కుర్ర హీరోలతో పోటీ పడాల్సిన టైం లో రవితేజ కి సరైన ఆఫర్లు రావటం లేదు. పోయిన సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకున్న “బెంగాల్ టైగర్” తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక అప్పటినుంచీ ఇప్పటిదాకా అతడి సినిమా ఏదీ మొదలవలేదు. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ సినిమా ఈ పాటికి పూర్తికావచ్చేదే… అయితే రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నారంతూ ఆ సినిమా నుంచి బయటికొచ్చేశాడు రవితేజ. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో అనుకున్న సినిమాను త్వరగానే మొదలుపెడదామని చూశాడు కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పటిదాకా అది పట్టాలెక్కలేదు. దీంతో రవితేజ కెరీర్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో విలువైన ఆర్నెల్లు వృథా అయిపోయాయి. మామూలుగా అయితే ఒక సినిమా పూర్తి చేయవచ్చు ఈ సమయం లో. ఇక ఇప్పుడు ఆ సినిమా ఒప్పుకోక… అనుకున్న సినిమా మొదలు కాక వచ్చే రెమ్యునరెషన్ ని కూడా లాస్ అయ్యాడు రవితేజా… ఇప్పటికైనా మేలుకొని కొద్దిగా ఉత్సాహం చూపిస్తే తప్ప ఇప్పుడున్న పోటీలో నిలదొక్కుకోవటం కష్టమే. మరి ఈసంగతి రవితేజా కి ఎవరైనా చెప్పారో లేదో .