ఆ బంగ్లాలో… అమ్మాయి ఆత్మ తిరుగుతోందా?

దయ్యాల సినిమాల హవా ఇప్పుడు అన్ని చిత్ర సీమల్లో నడుస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో మరీను. ఆ సినిమాలకు పెట్టే ఖర్చు కచ్చితంగా వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు. కాగా ఇప్పుడు కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. అది కన్నడతో పాటూ తెలుగు, తమిళ, హిందీల్లో కూడా విడుదలవ్వబోతోంది.

నిజంగా జరిగిన కథ ఆధారంగా దానిని తీస్తున్నారు. గుజరాత్ లో 1997లో ఓ 13 ఏళ్ల అమ్మాయి కాలిన గాయాలతో మరణించింది. ఆమె టెస్ట్ ట్యూబ్ బేబీ. ఆ అమ్మాయి ఫ్యామిలీ 22 గదులున్న పెద్ద బంగ్లాలో నివసించేవారు. ఆ బంగ్లాలో ఇప్పటికీ ఆ అమ్మాయి దయ్యమై తిరుగుతోందని చుట్టుపక్కల వారి నమ్మకం. ఆ కుటుంబం అనుమతి తీసుకుని కన్నడ డైరెక్టర్ సుమంత్ కె గొల్లహల్లి సినిమాను చిత్రకరిస్తున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా బేబీ సుహాసిని నటిస్తుండగా… మరో ముఖ్యపాత్రలో సుహాసిని మణిరత్నం నటిస్తున్నారు.