హను రాఘవపూడితో అఖిల్?

తొలి సినిమా తరువాత మలి సినిమా చేయడానికి విపరీతమైన పురిటి నొప్పులు పడుతున్నాడు అఖిల్. ఏ డైకర్టర్ ఒక పట్టాన నచ్చడం లేదు..ఏ కథా ఓకె అనడం లేదు. కళ్యాణ్ తో చేయమన్నడు డాడీ నాగార్జున..నో అన్నాడు. వంశీ పైడిపల్లి అన్నాడు..సరే ఓకె అన్నాడు అఖిల్. కానీ కథ సెట్ కాలేదు.

ఈయనేమో రీమేక్ అంటాడు.ఆయనేమో స్ట్రయిట్ కథ చేద్దాం అంటాడు. అక్కడికి అలా ఆగింది. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే. అఖిల్ వెళ్లి వెళ్లి హను రాఘవపూడి దగ్గర సెటిల్ అయ్యాడని. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ లాంటి మీడియం సినిమాలు చేసిన హను రాఘవపూడితో సినిమా చేయాలని అఖిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

హను రాఘవపూడి అంటే మీడియం బడ్జెట్ సరిపోతుంది. మహా అయితే పది కోట్లు చాలు. అప్పుడు నాగ్ అన్నపూర్ణ బ్యానర్ ఫైనే నిర్మించేందుకు ముందుకు వస్తాడు. బహుశా అందుకే కావచ్చు..ఈ సెట్టింగ్.