శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]

జీఎస్టీ సవరణలకు లోకసభ ఓకే

చరిత్రాత్మక పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ సవరణ బిల్లును లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతేడాది జీఎస్టీ బిల్లును లోక్ సభ ఆమోదించినప్పటికీ.. రాజ్యసభలో గతవారం నాలుగు సవరణలతో బిల్లు పాస్ అయింది. తాజాగా లోక సభ కూడా ఆమోదించడంతో…. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టయింది. జీఎస్టీ రాజ్యాంగ 122వ సవరణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. 443 అనుకూల ఓట్లతో ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లులోని సవరణలను సభ ఆమోదించింది. సవరించిన బిల్లును మధ్యాహ్నం లోక్ […]

ఆగస్టు 8న జిఎస్‌టి బిల్లుపై లోక్‌సభలో చర్చ

లోక్‌సభలో సోమవారం జిఎస్‌టి బిల్లుపై చర్చ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అలాగే ప్రధాని ప్రమేయంతో వివిధ రాష్ట్రాల్లోని శాసన సభల్లో కూడా దినికి ఆమోదం లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుకు ఆమోదం ఆరోజే ఆమోదం పొందుతుందని భావిస్తున్నామని ఒక సీనియర్ కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే ఆరోజు జిఎస్‌టి బిల్లుపై ప్రధాని మోడీ చర్చను ప్రారంభిస్తారని తెలిపారు. కాగా ఇప్పటికే రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే! […]

రాజ్యసభలో ఆప్ నేత వీడియో చిచ్చు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. భగవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళం తలెత్తింది. సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే బాధ్యత ఎవరిదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ […]