ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చును రాజేసినట్లయింది. ఇన్నాళ్లు కుటుంబాల్లో ఎన్ని విభేదాలు ఉన్న కుటుంబమంతా కలిసికట్టుగా కనిపించేవారు. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా మెగా కుటుంబం రెండుగా చీలిపోయినట్లు అయింది. ఈ వివాదానికి ఐకాన్ స్థార్ ప్రధాన కారణంగా మారాడు. ఏపీ ఎన్నికల పర్యటనలో కుటుంబానికి విరుద్ధంగా ఆపోజిట్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లి తీవ్ర ధూమారానికి కారణమయ్యాడు అల్లు అర్జున్. అయితే బన్నీ ప్రచారం చేసిన పార్టీకి కాకుండా.. వేరే పార్టీ అధికారంలో […]