అవును! ఇప్పుడు కాకినాడ ఓటర్లు ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రారంభమైన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఉదయం ఏడు గంటల నుంచి ప్రశాంతంగా సాగిపోతోంది. ఓటర్లు ఇక్కడ కూడా తండోపతండాలుగా పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. మహిళలు ఇళ్లలో పనులను వాయిదా వేసుకుని మరీ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్కడ ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ పార్టీకి ఓటేయాలి? అనేది కాకుండా.. ఏ పార్టీకి ఓటేస్తే.. మురిగిపోతుంది? తమ ఓటు విలువ లేకుండా పోతుంది? […]