కరోనా విపత్తు తరువాత టాలీవుడ్ పరిశ్రమ షేప్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితం అయినపుడు OTTలకు బాగా అలవాటు పడ్డారు. ఇక అదే అలవాటు లాక్డౌన్ తరువాత కూడా కొనసాగుతోంది. దాంతో నిర్మాతల మండలి ఆ మధ్య థియేటర్లను కాపాడుకోవడం కోసం అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవడం కోసం సినిమాలు థియేటర్‌లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. […]