టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్‌

రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లో ఒంట‌రిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణ‌మైన రాజ‌కీయానికి అయినా తెర‌లేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్నా మ‌రోవైపు టీడీపీని వీలున్నంత వ‌ర‌కు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వ‌దులుకోవ‌డం లేదు. అటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణ‌గదొక్క‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేత‌లు, రెండు రాష్ట్రాల సీఎంలు […]

బాబు ప్లాన్ బాబుకే దెబ్బేసింది

ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీ ప‌టిష్ట‌త కోసం వేసిన ఓ ప్లాన్ రివ‌ర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. త‌న ప్లాన్ త‌న‌కే రివ‌ర్స్‌లో తిరిగి రావ‌డంతో చంద్ర‌బాబు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాడు. ఏపీలో గ‌త యేడాది కాలంగా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ నుంచి త‌న పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు […]

క‌ర‌ణం వ‌ర్సెస్ గొట్టిపాటి పోరుపై బాబు సీరియ‌స్‌

ప్ర‌కాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ధ్య కొద్ది రోజులుగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా బ‌ల్లికుర‌వ మండ‌లం వేమ‌వ‌రంలో క‌ర‌ణం వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు దారుణ హ‌త్య‌కు గుర‌వ్వ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గొట్టిపాటి వ‌ర్గీయులు జ‌రిపిన దాడిలోనే త‌మ వ‌ర్గీయులు హ‌త్య‌కు గుర‌య్యార‌ని క‌ర‌ణం బ‌ల‌రాం మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఒంగోలులో జ‌రిగిన ప్ర‌కాశం […]

కేశినేని వ్యాఖ్య‌ల మంట‌.. బీజేపీ-బాబు మ‌ధ్య తంటా!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో రాజ‌కీయ దుమారాన్నే సృషించాయి. 2014లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే త‌న‌కు మెజారిటీ త‌గ్గింద‌ని ఆయ‌న అన్నారు. 2019లో ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి ల‌క్ష పైగా మెజారిటీ సాధిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు బీజేపీ, టీడీపీల మ‌ధ్య అంతులేని అగాధాన్ని సృష్టించాయి. కేశినేని వ్యాఖ్య‌ల‌పై గుంటూరుకు చెందిన బీజేపీ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ […]

గెలుపే ధ్యేయంగా టీడీపీ బరిలోకి

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మిగిలి ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు చాప‌కింద నీరులా ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 13 జిల్లాల‌కు టీడీపీ టీంను ఆయ‌న రెడీ చేసేశారు. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న జిల్లా, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌య్యింది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడి ఎంపిక మాత్రం పెండింగ్‌లో ఉండ‌గా… మిగిలిన అన్ని జిల్లాలు, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక పూర్త‌య్యింది. […]

మోడీ రాజ‌కీయం అదుర్స్‌ …మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి!

పాలిటిక్స్‌లో ఎవ‌రూ ప‌ర్మినెంట్ ఫ్రెండ్స్ ఉండ‌ర‌నేది మ‌రో సారి ప్ర‌ధాని మోడీ కూడా నిరూపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారా? అంటే ఔన‌నే అనిపిస్తోంది. 2014లో చేతులు ప‌ట్టుకుని చెమ్మ‌చెక్క‌లాడిన టీడీపీ అధినేత బాబుతో బోరు కొట్టి.. వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో త‌మ‌కు గిట్ట‌ని, త‌మ‌తో పొసగ‌ని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో దోస్తీకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణ అధికార టీఆర్ ఎస్.. ఎన్డీయేలో భాగ‌స్వామి కాదు. అయిన‌ప్ప‌టికీ.. మోడీ.. కేసీఆర్ స‌ర్కార్ ఏం […]

వెస్ట్ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఎమ్మెల్యే..!

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీకి కొత్త అధ్య‌క్షుడు రానున్నాడా ? ప‌్ర‌స్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు, రాజ్య‌స‌భ స‌భ్యురాలు తోట సీతారామ‌ల‌క్ష్మికి బ‌దులుగా మ‌రో కొత్త వ్య‌క్తిని నియ‌మించ‌నున్నారా ? అంటే ప్ర‌స్తుతం జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే చెపుతున్నాయి. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తోట‌సీతారామ‌ల‌క్ష్మి జిల్లా ప‌గ్గాలు చేప‌డుతూ వ‌స్తున్నారు. అప్పటి నుంచి ఆమె జిల్లాలో […]

పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లతో టీడీపీలో కలకలం

సొంత వ‌దినా, మ‌రిది అయినా మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నేత ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబాల మ‌ధ్య ఉప్పు నిప్పు వాతావ‌ర‌ణం ఉంది. ఈ రెండు కుటుంబాల వారు ఇటీవ‌ల స‌రిగా మాట‌లే లేవ‌న్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయంగా చంద్ర‌బాబుతో విబేధించి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ద‌గ్గుపాటి దంప‌తులు ప‌దేళ్ల పాటు అక్క‌డ మంచి పొజిష‌న్‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసి […]

తొందరపడొద్దు భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ఆలోచిద్దాము

తెలంగాణ పాలిటిక్స్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను సంపాదించుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబే పొలిటిక‌ల్‌గా అణ‌గ‌దొక్కుతున్నార‌ట‌! ఇప్పుడు దీనిపైనే తెలంగాణ‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఏపీకి ప‌రిమిత మైన నేప‌థ్యంలో తెలంగాణ‌లో కేసీఆర్‌కు దీటుగా టీడీపీ త‌ర‌ఫున మాట్లాడుతున్న ఏకైక వ్య‌క్తి రేవంత్ అని ఒప్పుకోక త‌ప్ప‌దు. దీంతో కేసీఆర్‌కి మొగుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది రేవంతే అనే టాపిక్ పుట్టింది. ఈ నేప‌థ్యంలో 2019 […]