సోము వీర్రాజు! ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న మిత్రపక్షం నేత. టీడీపీ-బీజేపీల మిత్రపక్షాలే అయినప్పటికీ.. సోము ఆవేశం, ఆవేదన మాత్రం.. విపక్షం మాదిరిగానే ఉంటోంది. తమను టీడీపీ అధినేత కరివేపాకులా చూస్తున్నారని, తమకు విలువ లేదని, ఆయనకు చెక్కభజన చేసేవాళ్లనే పట్టించుకుంటున్నాడని పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సోము.. అసలు టీడీపీతో బంధం వద్దు.. విడాకులే ముద్దు అంటూ.. అధిష్టానానికి లేఖలు రాసి, కార్యకర్తలతో ప్రదర్శనలు సైతం ఇప్పించాడు. దీనికి కారణం పైన చెప్పుకొన్నట్టు.. టీడీపీ […]
Tag: chandra babu
యనమల, రాజప్పకు బాబు వద్ద ప్రయారిటీ తగ్గుతోందా…. ఇదే నిదర్శనం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కాకినాడ మేయర్ ఎంపికలో అదే జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు నిమ్మకాయల చినరాజప్పతో పాటు యనమల రామకృష్ణుడుకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. ముందునుంచి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగానే మేయర్ పీఠాన్ని కాపులకు ఇస్తామని చెప్పడంతో ఈ వర్గంలో గెలిచిన నలుగురు మహిళలు పోటీపడ్డారు. సుంకర లక్ష్మీప్రసన్న, సుంకర పావని, మాకినీడి శేషుకుమారి, అడ్లూరి వరలక్ష్మి పోటీపడ్డారు. వీరి నలుగురికి […]
చంద్రబాబుపై అప్పటి పగ తీర్చుకుంటోన్న పురందేశ్వరి
అవును. ఇప్పుడు బీజేపీ వర్గాల్లో ఇదే టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో టికెట్ గురించి చిన్నమ్మ ఓ శపథం పట్టిందని, సీఎం చంద్రాబుపై పైచేయి సాధించేలా తన పంతం నెగ్గించుకోవాలని నిర్ణయించుకుందని అంటున్నారు బీజేపీ నేతలు. 2014లో తనకు బాబు చేతిలో జరిగిన అవమానానికి రెట్టింపు ప్రతీకారం తీర్చేయాలని ఆమె డిసైడ్ అయ్యారని అంటున్నారు. రాజకీయంగా తనను తాను నిరూపించుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధమయ్యారని చెబుతున్నారు. మరి ఈ శపథం ఏమిటో? పురందేశ్వరి పంతం […]
కలల రాజధానికి ఇన్నిసార్లు శంకుస్థాపనలా!
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆంధ్రా ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచస్థాయి హంగులతో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత నగరాన్ని నిర్మిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రజలు కూడా అంతేస్థాయిలో ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే డిజైన్లు మారుతున్నాయి.. మాస్టర్ ఆర్కిటెక్ సంస్థలు మారుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ ఏకంగా మూడు సార్లు అమరావతికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు. కానీ భవంతుల నిర్మాణానికి అడుగు కూడా […]
చంద్రబాబును ముంచేస్తున్న ట్రాన్స్‌స్ట్రాయ్
పోలవరం.. పోలవరం.. పోలవరం.. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం వల్లెవేసే పదం! పోలవరం ఏపీ జీవనాడి అని సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ ఉంటారు! పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేయాలని పదేపదే అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే అని తేలిపోయింది. పోలవరం కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ.. ఇప్పుడు చంద్రబాబును పూర్తిగా ముంచేసింది. పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం ఇప్పుడు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోంది. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో […]
సోమిరెడ్డి ప్రకటన ఎంత పనిచేసింది!
పార్టీకి చెందిన ఏ ముఖ్య ప్రకటన అయినా.. అందులోనూ అటు పార్టీకి, ఇటు రైతులకు సంబంధించి కీలక అంశాలకు చెందిన ముఖ్య విషయాలను సీఎం చేస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రులు చేసినా రాని మైలే జ్.. సీఎం చేస్తే వస్తుందనడంలో సందేహంలేదు. సీఎం ఎంత చనువిచ్చినా.. అందరి కన్నా ఎక్కువగా ప్రాధాన్య మిస్తున్నా.. దానిని దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకవేళ చేస్తే.. ఎలా ఉంటుందో మంత్రి సోమిరెడ్డికి ఇప్పుడి ప్పుడే తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ […]
లోకేష్‌తో యనమల ఢీ! గెలుపెవరిది?
సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కి, పార్టీలో మరో సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల మధ్య ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ మేయర్ విషయంలో తేడా వచ్చిందని సమాచారం. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించిన విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ స్థానం ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే […]
చంద్రబాబు హడావిడి వెనక కథేంటి..!
రాష్ట్రంలో ఇటు అధికార పక్షం, అటు విపక్షం రెండూ అప్పుడే మరో సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయా? అన్నంత హడావుడి మొదలు పెట్టేశాయి. వైసీపీ అధినేత జగన్ తన నవరత్నాలు, వైఎస్సార్ ఫ్యామిలీ వంటి కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు. ఇక, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాజాగా సోమవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని షురూ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు […]
టీడీపీ+జనసేన పొత్తు…. జనసేన సీట్ల లెక్క తేల్చేసిన బాబు
ఎవరెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మంచి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మంచి దోస్తులే అన్నది కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికి అయినా అర్థమవుతుంది. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను […]