నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల సినిమాలో నటించారు. ఈ సినిమా 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈనెల 30వ తేదీకి బాలకృష్ణ నటుడుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ శుభ తరుణంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు సినీ పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరిగే ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు బుధవారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కర్టెన్ […]