వైసీపీలో స‌మ‌ర్థుల‌కు ప‌ద‌వులు? మ‌రి టీడీపీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్టు బాబు..!

మంత్రి వ‌ర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎట్ట‌కేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక స‌రికొత్త లాజిక్‌ను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా సమాధానం చెప్పార‌ని టీడీపీ నేత‌లు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. పార్టీని ఎంతో కాలంగా న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు స‌మ‌ర్థులు లేరా? అనే ప్ర‌శ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించ‌న‌వారే స‌మ‌ర్థులా? మేము కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్లు […]

ఇకనైనా ఏపీ నాయకులు మారతారా

త‌మిళులు జ‌ల్లికట్లు కోసం పోరాడిన తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింది. జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వీళ్ల ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు. […]