నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మరణం నుంచి అభిమానులు, కుటుంబ సభ్యులు బయటపడుతున్నారు. కానీ, తారకరత్నను ఆయన భార్య ఆలేఖ్య రెడ్డి మాత్రం మరచిపోలేకపోతోంది. ప్రేమించి, పెళ్లి చేసుకుని, జీవితాంతం తోడు ఉంటానని మాట ఇచ్చిన భర్త ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం అలేఖ్య జీర్ణించుకోలేకపోతోంది. […]