గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి! ముఖ్యంగా రాజధాని ప్రాంతం కావడంతో అటు అధికార, విపక్ష పార్టీలు ఈ జిల్లాపై పూర్తిగా దృష్టిసారించాయి. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే.. ఎవరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు? ఎవరికి టిక్కెట్టు ఇస్తారు అనే చర్చ అప్పుడే మొదలైంది. క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబు.. ఇప్పటికే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తూ నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ. . ప్రజల్లో […]
Category: Politics
ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటికి శత్రువు రెడీ
పశ్చిమగోదావరి జిల్లాకు గుండె కాయ వంటి ఏలూరులో టీడీపీకి ఎదురు లేదు. ఇక్కడి ఎంపీ మాగంటి బాబుకు ఎక్కడా లేని ప్రజాదరణ సొంతం. అయితే, ఇది నిన్నటి వరకు వినిపించిన మాట. కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. మాగంటి చెంబూ చేటా సర్దు కోవాల్సిన సమయం ఆసన్నమైందనే టాక్ వినిపిస్తోంది! అదేంటి? ఎందుకు? అని అనుకుంటున్నారా? విపక్షం వైకాపా అధినేత జగన్ గీసిన స్కెచ్ మహిమ అలా ఉందట! మాగంటికే కాకుండా పశ్చిమలో టీడీపీకి మంచి పట్టున్న […]
హీటెక్కిన హిందూపురం టీడీపీ పాలిటిక్స్
టీడీపీ కంచుకోట హిందూపురం నియోజకవర్గంలో ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది! ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు వియ్యంకుడు, సినీ హీరో బాలయ్య ఇమేజ్ వీధుల పాలైపోతోంది. ముఖ్యంగా ఆయన తన నియోజక వర్గానికి చుట్టపు చూపుకే పరిమితం కావడం, ఉన్న టైం మొత్తం సినిమా షూటింగులతో గడిపేస్తున్నాడు. దీంతో నియోజకవర్గంలో తన బాధ్యతలు నెరవేర్చేందుకు తన అనుచరుడు శేఖర్‌కి బాధ్యతలు అప్పగించాడు బాలయ్య. అయితే, ఇదే అవకాశంగా భావించిన శేఖర్ తనదైన శైలిలో […]
బాబు దెబ్బకి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదా..?
శివరాత్రి చేసుకునేందుకు కనీసంలో కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. అయితే, ఇది సాధారణ జనాలకి. కానీ, ఏపీ మంత్రులకి మాత్రం శివరాత్రి జాగారం అప్పుడే వచ్చేసిందట!! అది కూడా నిత్యం తమ మధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చినబాబే మంత్రులకు శివరాత్రి తీసుకొచ్చారట! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒకరిద్దరు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులకు నిద్రమాత్రలేసుకున్నా.. […]
వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనా…అక్కడ!
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టించాలని గట్టిగా నిర్ణయించుకున్న చంద్రబాబు అండ్ కో కలలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఈ జిల్లా ప్రజలను ఆకట్టుకోవడం కోసం శతథా శ్రమిస్తున్నప్పటికీ.. బాబు పక్షాన నిలబడే వాళ్లు ఎవరూ కనిపించడం లేదనే పరిస్థితి తాజా పరిణామాలతో స్పష్టమైంది! జగన్ ఇలాకాగా పేరు పడ్డ కడపలో వైకాపా అడ్రస్ లేకుండా చేద్దామని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆయనకు తోడుగా ఆయన అనుచరులు కడప టీడీపీ నేతలు […]
ఏపీ మంత్రి ఫై బాబు పవర్ పంచ్
ఏపీ సీఎం చంద్రబాబు తన పవర్ చూపించారా? తనపై ఆరోపణలు చేస్తే.. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. తెరవెనుక చేయాల్సింది చేసస్తానని బాబు చేసి చూపించారా? ఎంతటి వారైనా తనకు లోబడే ఉండాలనే సిగ్నళ్లను చంద్రబాబు పంపించారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది రెవెన్యూ శాఖ నుంచి! అదేంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ చదవాల్సిందే! తన మంత్రి వర్గంలో కీలక బాధ్యతలను అప్పగించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి.. రెండు నెలల […]
మోత్కుపల్లికి ఫేవర్ గా చక్రం బాగానే తిప్పారు కానీ !
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ గిరీ ఆశలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. ఆయన ఎన్నాళ్లుగానో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే క్రియాశీల రాజకీయాలకు కూడా చాలా దూరంగా ఉండి చానాళ్లయింది. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా టీడీపీ పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమం, ప్రాజక్టుల పోరు వంటివి చేపట్టినా మోత్కుపల్లి మౌనంగానే ఉండి పోయారు. ప్రధాని మోడీ హయాంలోనే తనకు గవర్నర్ గిరీ ఖాయమని ఆయన అనుకున్నారు. అయితే, ఇప్పట్లో ఆయనకు […]
వైకాపాలో జగన్ సరికొత్త వ్యూహం
వైకాపాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. ప్రజా సమస్యలపై మరింతగా గళం విప్పేలా, రానున్న ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలం పెంచేందుకు జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఉన్న క్షేత్రస్తాయి బలం వైకాపాకి లేదు. ముఖ్యంగా మహిళా విభాగం బలహీనంగా ఉంది. పైకి ఒక్క రోజా తప్ప ఎవరూ లేరు. అదేవిధంగా యువజన విభాగం కూడా పెద్దగా యాక్టివ్‌గా లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఈ రెండు విభాగాలను బలోపేతం […]
ఎర్రబెల్లి.. రమణల భేటీ.. మరోసారి రాజకీయ వేడి!
టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, టీఆర్ ఎస్‌లో చేరిన మాజీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావులు భేటీ అయ్యారు. సాధారణంగా ఏ పార్టీలోనో.. ఏ కార్యక్రమంలోనే కలుసుకుని మాట్లాడుకుని ఉంటే.. ఇప్పుడు వీళ్లిద్దరు పెద్దగా వార్తల్లో ఎక్కేవాళ్లుకారు! కానీ.. ఎర్రబెల్లి స్వయంగా రమణ ఇంటికి వెళ్లి.. దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయ్యారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు నడిచాయి? ఇద్దరూ తమ తమ రాజకీయ వ్యూహాలకు సంబంధించి ఎలాంటి ముందస్తు ప్లాన్‌తో […]