మంత్రి వర్గ విస్తరణలో ఎవరిని ఉంచుతారో తెలీదు.. ఎవరి బెర్తు కన్ఫార్మ్ అవుతుందో క్లారిటీ లేదు! ఎవరి పోస్టు పీకేస్తారో ఊహలకు అందడం లేదు! పార్టీ అధినేత అనుగ్రహం ఎవరిపై ఉంటుందో ఇప్పటికీ స్పష్టత లేదు! కానీ ఆశావహుల జాబితా మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్నానని, తనకు అవకాశం కల్పించాలని ఒకరు… తనకు చోటు కల్పిస్తే జిల్లాలో సామాజిక అంశాల పరంగా బలం పెరుగుతుందని మరొకరు.. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు […]
Category: Politics
నాకు వ్యక్తులుకన్నా పార్టీ ముఖ్యం .. మంత్రిపై బాబు ఫైర్
విశాఖలో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భరించలేను` అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోతే.. ఇక చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించబోనని స్పష్టంచేశారు. కొంతకాలం నుంచీ విశాఖలో గంటా వర్సెస్ అయ్యన్న వార్ జరుగుతోంది. అధినేత చంద్రబాబు ఎన్ని సార్లు వీరిద్దరినీ పిలిచి మందలించినా.. […]
తిరుమల వెంకన్నకు కేసీఆర్ కానుకలు ఇవే…
తెలంగాణ ఉద్యమ సమయంలోని మొక్కులను, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు సీఎం కె,చంద్రశేఖర్ రావు!! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలో తెలంగాణ సిద్ధించేందుకు ఎక్కని మెట్లు లేవు.. మొక్కని దేవుడు లేడని ఆయన తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటీవలే భద్రాకళి అమ్మవారికి కిరీటం, ఖడ్గం; అలాగే కురివి మల్లన్నకు మీసాలు కూడా సమర్పించారు. ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడి మొక్కు చెల్లిచేందుకు సిద్ధమయ్యారు. దాదాపు రూ.6కోట్ల విలువైన ఆరణాలను శ్రీవారికి కానుకగా సమర్పించబోతున్నారు. రెండు […]
కడప ఎమ్మెల్సీలో గెలుపు ఎవరిది..? ఓటు రేటు తెలిస్తే షాకే..!
మండలి ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అధికార, విపక్షాలు శిబిర రాజకీయాలకు తెరతీశాయి. ముఖ్యంగా ప్రతిపక్ష అధినేత జగన్ సొంత జిల్లా కడపపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ప్రతిపక్షం ఆరాటపడుతుంటే.. ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తోంది. ఇరు పక్షాల వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పంట పండింది. తమ శిబిరాల్లోకి వచ్చే వారిపై కాసులు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రూ.40 లక్షల వరకూ […]
ఆ రాయలసీమ మంత్రి కి ఉద్వాసన.. ఆ ఎమ్మెల్సీ లీకువీరుడేనా..!
టీడీపీలో మంత్రి వర్గ విస్తరణ సరికొత్త లీకులకు వేదికగా మారుతోంది. ఫలానా వ్యక్తి మంత్రి పదవి పోతుందని.. ఆ స్థానంలో మరోవ్యక్తి మంత్రి అవుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా అనంతపురానికి చెందిన మంత్రి పల్లె రఘనాథరెడ్డికి కూడా ఈసారి ఉద్వాసన తప్పదనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేగాక పల్లె స్థానంలో అదే జిల్లాకు చెందిన పయ్యవుల కేశవ్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ లీకుల వెనుక కేశవ్ ఉన్నాడని, మంత్రి పదవి […]
టీ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన సర్వే
టీ కాంగ్రెస్‌లో ఐదుగురు లీడర్లు…60 గ్రూపులు అన్న చందంగా పరిస్థితి ఉంది. ఒకరికి ఒకరికి అస్సలు పడడం లేదు. సీనియర్ నాయకులు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఈ టైంలో ఓ సర్వే ఇప్పుడు వీరి మధ్య పెద్ద చిచ్చు రేపింది. తాజాగా సర్వే ఫలితాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓ సర్వే చేశామని చెప్పిన కాంగ్రెస్ కు 55 స్థానాలు గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. […]
ఆ మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ … ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకూ అధికార పక్షం హవా నడిచిన చోట.. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ పవనాలు జోరుగా వీస్తున్నాయి. వైసీపీని వీడి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోతుంటే.. వారి ప్రత్యర్థులుగా, టీడీపీలో బలమైన నేతలుగా ఉన్నవారు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న అధినేత జగన్‌కు.. పార్టీలో చేరిన, చేరబోయే వారిని అస్త్రాలుగా మార్చబోతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి, ఆళ్లగడ్డ, […]
కేసీఆర్ కు కోవర్టుగా కాంగ్రెస్ మాజీమంత్రి
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఉనికి కాపాడుకోవాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకి వందడులు వెనక్కి అన్న చందంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ముదురుతున్న విభేదాలు.. అంతర్గతంగా ఉన్న కలహాలకు ఆజ్యం పోస్తున్నాయి! ముఖ్యంగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని, టీఆర్ఎస్‌కు ఏజెంట్‌లా మారిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత […]
వైసీపీ క్యాడర్ ను తికమక పెడుతున్న మాజీమంత్రి
ప్రస్తుత రాజకీయాల్లో `గోపి(గోడ మీద పిల్లి)`లు ఎక్కువమంది! ఏమాత్రం మంచి అవకాశం వచ్చినా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోయే నాయకులే ఎక్కువ! ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ.. అటు అధికార పార్టీ నేతలోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. రెండు పడవల ప్రయాణం చేస్తున్న వారే అధికం!! ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఒక మాజీ మంత్రి కూడా ఇలా వ్యవహరిస్తుండటంతో.. ఆమె ఏ పార్టీకి చెందిన వారో తెలియక […]