నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తగిలిన దెబ్బల నుంచి వైసీపీ అధినేత జగన్ కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని పదునైన వ్యూహంతో 2019పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తనపై విమర్శలతో ఎడా పెడా నోరు పారేసుకుంటున్న అధికార పక్షానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారని లోటస్‌పాండ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న మంత్రి అచ్చన్నాయుడిపై జగన్ అంతర్గతంగా చర్చిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు […]
Category: Politics
కలల రాజధానికి ఇన్నిసార్లు శంకుస్థాపనలా!
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆంధ్రా ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచస్థాయి హంగులతో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత నగరాన్ని నిర్మిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రజలు కూడా అంతేస్థాయిలో ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే డిజైన్లు మారుతున్నాయి.. మాస్టర్ ఆర్కిటెక్ సంస్థలు మారుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ ఏకంగా మూడు సార్లు అమరావతికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు. కానీ భవంతుల నిర్మాణానికి అడుగు కూడా […]
షాక్.. వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి చుక్కలు చూపిన జనాలు
మనం ఏం చేసినా అడిగేదెవరు? జనాలు వెర్రిబాగులోళ్లు! మనం ఏం చెబితే అదే! జనాలు వినితీరతారు అంతే!! అని అనుకునే రాజకీయ నేతలకు గట్టి సమాధానం లాంటి ఉదంతం ఇది! అంతేకాదు, ప్రజలు పిచ్చివాళ్లు కారని, రాజకీయ నేతలను వారు నిశితంగా గమనిస్తుంటారని, నేతలను సమయం వచ్చినప్పుడు కడిగిపారేస్తారని నిరూపించే సంఘటన కూడా ఇది!! విషయంలోకి వెళ్తే.. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రం పఠించారు. దీంతో 20 మంది వరకు జగన్ బ్యాచ్ […]
పయ్యావులకు యాంటీగా టీడీపీలో కుట్ర
పయ్యావుల కేశవ్.. గత మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించి.. భంగపడిన వారిలో ఆయన ఒకరు! మంత్రి పదవి దక్కకపోయినా.. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు! అయితే కొద్దికాలంగా ఆయనకు పార్టీలోని నాయకుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నాయకులంతా ఒక్కటై ఆయన్ను దెబ్బకొట్టేం దుకు కుట్ర పన్నుతున్నారు. జిల్లా రాజకీయాల్లో ఎంతో అపార అనుభవం ఉన్నా.. ప్రస్తుతం ఆయనకు యాంటీగా నాయకులు పావులు కదుపుతున్నారు. కేశవ్‌కు వ్యతిరేకంగా సహాయ నిరాకరణకు కూడా […]
ఆ ఒక్క గుడిలో మాణిక్యాలరావు పెత్తనం లేదా..!
గత ఎన్నికల్లో చివరి క్షణంలో బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖా మంత్రిగా గెలిచారు. ఏపీలో దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. అయితే ఆయన శాఖకు సంబంధించిన ఓ గుడి విషయంలో మాత్రం ఆయన పెత్తనం ఉండదట. ఆ గుడి విషయంలో సంబంధిత శాఖాధికారులు కూడా మాణిక్యాలరావును లైట్ తీస్కొంటారట. మంత్రిగా బాధ్యతలు తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు మాణిక్యాల రావు దుర్గగుడి వ్యవహారాల్లో పెద్దగా జోక్యం […]
ఈ సారైనా జేపీ సక్సెస్ అయ్యేనా?
మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా పార్టీ మాజీ అధినేత జయప్రకాశ్ నారాయణ ఉరఫ్ జేపీ మరోసారి ప్రజల్లోకి వస్తున్నారట. 2009లో హైదరాబాద్‌లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన తర్వాత కాలంలో పార్టీని పటిష్టం చేసుకోలేకపోయారు. లాజిక్ తెలియకుండా వ్యవహరించిన ఫలితంగా రాజకీయాలనుంచి తప్పుకున్నారు. అయితే, ఇప్పుడు మళ్లీ తన పాత స్వరూపాన్ని ప్రజలకు పరిచయం చేయాలని భావిస్తున్నారట. వ్యవస్థను మార్చేందుకు, పాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు లోక్‌సత్తా పార్టీ మలిదశ ఉద్యమానికి శ్రీకారం […]
నల్గొండ బాధ్యతలు ఉత్తమ్‌కి.. పదవికి ఎసరేనా?
రాజకీయాల్లో ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో చెప్పడం కష్టం. అయిన వాళ్లు.. నిన్నటి దాకా భుజం భుజం రాసుకుని తిరిగిన వాళ్లు కూడా అవకాశం వస్తే.. ఎక్కేయడానికి, ఏకేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయనపై గతం కొంత కాలంగా స్థానిక నేతల్లో చాలా మందికి పడడం లేదు. అటు పార్టీ పరంగా కావొచ్చు, ఇటు వ్యక్తిగత రాజకీయ పరంగానూ కావొచ్చు. […]
భారత్‌లో బుల్లెట్ ట్రైన్..మోడీకి విమర్శల వెల్లువ!
భారత్‌లో బుల్లెట్ ట్రైన్ వస్తోంది. త్వరలోనే ఈ ట్రైన్ పట్టాల మీదకి కూడా ఎక్కబోతోంది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కావడం, అది కూడా ప్రముఖ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్‌ఈఎల్) దక్కించుకోవడం ఒక పక్క ఆనందం కలిగిస్తోంది. రూ.1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జపాన్ సాయంతో పూర్తి చేయనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్- మహారాష్ట్రలోని ముంబైల మధ్య ఈ ట్రైన్ పరగులు పెట్టనుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కూడా గురువారం అహ్మదాబాద్‌లో […]
కిరణ్ వర్సెస్ పెద్దిరెడ్డి.. వారింకా మారలేదు!
అమెరికా-ఉత్తర కొరియాలు ఫ్రెండ్స్ అవుతాయా? భారత్ కన్నా ఎక్కువగా ఉత్తరకొరియా అమెరికాకి వ్యూహాత్మక భాగస్వామి అవుతుందా? ఏమో చెప్పలేం! పరిస్థితులు, అంతర్జాతీయ ఒత్తిడుల నేపథ్యంలో ఈ రెండు దేశాలు చెలిమి దిశగా చెట్టాపట్టాలేసుకుని తిరిగినా ఆశ్చర్యం అనిపించక మానదు!! అయితే, ఏపీకి చెందిన ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలు మాత్రం మారేలా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా.. కూడా ఆ ఇద్దరూ తమ పంథా వీడడం లేదట! వారిద్దరే ఒకరు మాజీ సీఎం కిరణ్ […]