బాలయ్య 101, 102, 103 క్లియర్ గా క్లారిటీగా అవే!

నందమూరి నట సింహం బాలయ్య వేసిన ప్లాన్ చూస్తుంటే మిగతా స్టార్ హీరోల దిమ్మ తిరిగి పోతుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వందవ సినిమా ఉండాలని అందరి దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి కథతో చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఇక తనకు కథ చెప్పిన మిగతా దర్శకులతో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అనుకున్నట్టుగానే బాలయ్య వందవ సినిమాకు రకరకాల సబ్జెక్ట్స్ టేబుల్ మీదకు వచ్చాయి. అయితే ఫైనల్ […]

గుడి కొట్టు-అభివృద్ధి సోట్టు:చంద్రోపదేశం

ఎక్కడైనా తుఫానుకి ముందు ఏదయినా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే జరిగే నష్టాన్నై తగ్గించవచ్చు.తుఫాను బీభత్సం సృష్టించేసాక అందరూ ధైర్యంగా ఉండండి,ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి లాంటి సూక్తులు ఎందుకు పనికొచ్చేవి?సరిగ్గా ఇలాగే ఉంది విజయవాడలో గుళ్ళు కూల్చివేతపై మన చంద్రబాబు గారి వ్యవహారం కూడా. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ తుఫాను చెప్పకుండా వచ్చింది కాదు,తెలీకుండా వచ్చింది అంతకంటే కాదు.బాబు గారు కనుసైగల్లో వచ్చిందే.లేకుంటే బాబు గారికి తెలీకుండా రాష్ట్ర రాజధాని అమరావతికి ఆనుకుని వున్న విజయవాడలో […]

నవదీప్‌కి మెగా టర్నింగ్‌ పాయింట్‌! 

యంగ్‌ హీరో నవదీప్‌, హీరోగా అవకాశాలు దక్కించుకోలేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకూ ఓకే చెప్పేస్తున్నాడు. ‘ఆర్య-2’ సినిమాలో నవదీప్‌ పాత్రకి ఎంతో పేరొచ్చింది. ‘చందమామ’ సినిమాతో హీరోగా అలరించాడు. ఇంకా మరికొన్ని సినిమాల్లో తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నాడీ యంగ్‌ హీరో. ‘బాద్‌షా’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు నవదీప్‌. అయితే ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘ధృవ’ చిత్రం ఇంకో ఎత్తు అని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. తమిళ […]

జగపతిబాబు హాలీవుడ్ ఎంట్రీ అదిరింది

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు హీరోలకి దీటుగా దూసుకుపోతున్నారు.లెజెండ్,శ్రీమంతుడు లాంటి సినిమాలు జగపతిబాబుకున్న డిమాండ్ ని అమాంతం పెంచేసాయి.దానికి తగ్గట్టుగానే జగ్గు భాయ్ కూడా చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.తెలుగు హీరోలకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జగ్గు ఇమేజ్ మళ్ళీ వచ్చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న […]

వారసులను తీర్చి దిద్దే పనిలో చంద్రులు

రెండు తెలుగు రాష్ట్రాలు…ఇద్దరు సీఎంలు… వారికి ఇద్దరు పుత్రరత్నాలు… రాజకీయంగా, ముఖ్యమంత్రులుగా పాలనలో తమదైన ముద్రవేస్తూ, ఇప్పటికిప్పుడు ఢోకాలేని ప్రభుత్వాలను నడుపుతూ దూసుకు వెళుతున్న ఇద్దరు చంద్రులూ, తమ వారసులకు… ఫుల్ లెంగ్త్ లో ట్రైనింగ్ ఇస్తూ…. దూసుకుపోతున్నారు. ఇటు కేసీఆర్ అయితే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుంటే…. ఇటు చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చక్క దిద్దే పని అప్పగించారు. మీ కుమారుడుని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిచయం చేస్తారా? అంటూ ఇటీవల […]

కోడెల కామెడీ:జనం నోటితో నవ్వరు

అనర్హత పిటిషన్లను తిప్పి కొట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చారట.ఇదే బాబు భజన మీడియా మొత్తం ఊక దంపుడు నిన్నటి నుండి.విడ్డూరానికి ఒక హద్దు పద్దు ఉండాలి.లేకపోతే ఏంటి స్పీకర్ కోడెల ఫిరాయింపు MLA లపై అనర్హత వేటేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.అనుకున్నట్టే పక్కాగా TDP పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే ఆయన ఎంచక్కా అసెంబ్లీ లోను బయట ఫాలో అవుతుంటారు.ఇప్పుడూ అదే చేశారు […]

వెంకటేష్ ‘రాధ’ డైరెక్టర్ అతనే

వెంకటేష్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తోనే మారుతి ఇంకో సినిమా చేయనున్నాడని సమాచారమ్‌. ‘బాబు బంగారం’ చేస్తున్నప్పుడే ఆ సినిమా గురించి కూడా చర్చలు ఓకే అయినట్లుగా తెలియవస్తోంది. అయితే ఇది ‘బాబు బంగారం’ కన్నా ముందు అనుకున్న కథ. ‘రాధ’ పేరుతో సినిమాని మారుతి అనౌన్స్‌ చేశాడు వెంకటేస్‌ హీరోగా. కొన్ని కారణాలతో అది ఆగింది. ‘బాబు బంగారం’తో శాటిస్‌ఫై అయిన వెంకటేష్‌, ‘రాధ’ సినిమానీ […]

బాలకృష్ణ కోసం 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలు

నందమూరి నటసింహం బాలకృష్ణ 100 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.ఇప్పటికే మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.అక్కడ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించారు.తర్వాత సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్ చిలుకూరు సమీపంలో వేసిన భారీ యుద్ధనౌక సెట్‌లో షూట్ చేశారు. తాజాగా జార్జియాలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ హిస్టారికల్ సినిమా.ఈ భారీ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలుంటాయట.కాగా ఈ షూటింగ్ జార్జియాలో మౌంట్ కజ్ […]

కరీనాకు మొదటి సైఫ్ కి మూడో బిడ్డ!

బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ తల్లికాబోతోంది. ఈ విషయాన్ని సైఫ్ అలీ ఖాన్ స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే తాము తల్లితండ్రులు కాబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. “ఈ శుభవార్త కోసం ఇంతకాలం వేచి ఉన్నవారందరికీ ధన్యవాదాలు” అంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. వోగ్ పత్రిక జులై సంచికకు కరీనా ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చింది. కుటుంబంపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ “వివాహిత ఉద్యోగిగా ఉండాలన్నది నా ఆశ. […]