కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా మారిన జిల్లా ఏదంటే నెల్లూరు పేరే గుర్తొస్తుంది. కానీ అలాంటి జిల్లాలోనే వైసీపీకి పెద్ద కష్టం వచ్చి పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేస్తుందని ప్రకటించిన నాటినుంచి ముఖ్య నేతలంగా ముఖం చాటేస్తుండటం అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఒక పక్క అభ్యర్థి ఎవరనే విషయం ఇంకా తేలనే లేదు.. మరో పక్క […]
Category: Latest News
కోదండరాం టార్గెట్ ప్రతిపక్షాలేనా..!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం.. ఎంట్రీతో ఇవి మరింత హీటెక్కాయి. ప్రస్తుతం విపక్షాలన్నీ ఆయన్ను ముందరుంచి సీఎం కేసీఆర్‌పై పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇప్పుడు కోదండరాం ప్రతిపక్షాల్లో సరికొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. ఆయన సొంతంగా పార్టీ పెడతారనేప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో.. పార్టీలోంచి వలసలు ప్రారంభమైతే తమపార్టీల భవిష్యత్తు అంధకారంలో పడిపోయినట్టేనని ఆందోళన చెందుతున్నాయి. అసలే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు సగం […]
ఉరకలు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్న ఏపీ టీడీపీ
ప్రపంచంలో వ్యాపారం – సినిమాలు – రాజకీయాలు ఇలా ఏ కీలక రంగాలు చూసుకున్నా వారసత్వం అనేది కామన్. వారి తండ్రి, తాతల నుంచి వచ్చిన ఇమేజ్‌ను అందిపుచ్చుకుని వారసులు దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తోందే. కొత్తేం కాదు. ఈ క్రమంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో తరం రాజకీయ వారసులు అధికారం, పదవి కోసం రేసులో దూసుకుపోతున్నారు. ఈ మూడో తరం లీడర్లలో ముందుగా ఏపీ సీఎం నారా […]
బాబుకు షాక్:ఏపీ కేబినెట్ ప్రక్షాళన సెగలు రేపడం ఖాయం
ఏపీలో మంత్రివర్గ విస్తరణ సాక్షిగా అధికార టీడీపీలో పెద్ద లుకలుకలు స్టార్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. పైకి మాత్రం వాతావరణం అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తోన్నా లోపల మాత్రం అసంతృప్తి గాలి బుడగలా ఉందని…అది ఎప్పుడైనా ఢాంన పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగనుంది. 7 గురు మంత్రులను తపించే బాబు కొత్తగా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పార్టీలో సామాజికవర్గాలు – ప్రాంతాలు – సీనియారిటీని […]
హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరిపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా అధికారంలోకి రాలేకపోయినందుకు ఒకపక్క హైకమాండ్ తీవ్ర మథనపడుతుంటే.. వచ్చే ఎన్నికల్లో గెలిచి కొంతవరకైనా స్వాంతన చేకూర్చాలనే అభిప్రాయం ఏ ఒక్కరిలోనూ కనిపించడంలేదు. ఆధిపత్య పోరుతో నాయకులు.. ఒకడుగు ముందుకు వందడుగులు వెనక్కి వేస్తున్నారు. కలసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం మాని,,ఎవరికి వారు తమ స్వలాభాన్ని చూసుకుంటన్నారు. ముఖ్యంగా పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీంతో […]
పళనిపై కక్ష సాధింపులకు కేంద్రం స్కెచ్ రెడీ
అమ్మ మరణం తర్వాత తమిళనాడులో పట్టు సాధించాలని… మాజీ సీఎం పన్నీర్ సెల్వాన్ని ముందుంచి తాము వెనక నుంచి చక్రం తిప్పాలని భావించిన కేంద్రం ఆశలకు పళనిస్వామి రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభలో జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించడంతో సైలెంట్ అయిపోయింది. అయితే `ఇంతటితో అయిపోలేదు, నిన్ను వదిలిపెట్టేది లేదు` అంటోంది కేంద్రం. ఎంతో కాలం ఆ స్థానంలో కూర్చోలేవు అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేస్తోంది. ఆయన గత చరిత్రను తవ్వి.. లొసుగులను బయటకు […]
కోదండరాంపై టీఆర్ఎస్ ” కులాస్త్రం “
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి.. అన్ని వర్గాలను సమైక్యం చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. కోదండరాం ఎదురుదాడితో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. దీని నుంచి బయటపడేందుకు ఆయన `కులం` కార్డును తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఎంపీ బాల్క సుమన్.. కోదండరాం రెడ్డి అని సంబోధించి సరికొత్త చర్చకు దారి తీశారు. ప్రస్తుతం దీనిపై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. దీని వెనుక పెద్ద కథే ఉందని సమాచారం. ఒకపక్క తాము సేఫ్ సైడ్‌లోకి […]
జగన్ కు రెండెకరాలిచ్చిన ఘట్టమనేని ఫ్యామిలీ
సొంత రాష్ట్రం ఏర్పడినా.. ఇంకా ప్రధానప్రతిపక్షమైన వైసీపీ హైదరాబాద్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై అటు ప్రజలు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నూతన కార్యాలయ భవనానికి సైలెంట్‌గా శంకుస్థాపన జరిగిపోయిందని.. పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వం భూమి ఇవ్వడంపై ఎదురుచూస్తున్నామని చెప్పిన జగన్‌కు.. ఇంత సడన్‌గా భూమి ఎక్కడ దొరికిందనేది ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ భూమి ప్రిన్స్ మహేశ్‌బాబు బంధువు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చెందినదిగా తెలుస్తోంది. తనకు చెందిన […]
లగడపాటి ఇంట్లో పెళ్లి బాజాలు
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సమైక్య వాదాన్ని పార్లమెంటులో వినిపించిన ఆయన.. రాష్ట్రం రెండు ముక్కలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి.. దానికి కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే! అయితే ప్రస్తుతం లగడపాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగే సమయం వచ్చింది. ఆయన ఇద్దరు కుమారులకు ఒకేసారి ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ వేదిక కాబోతోంది. […]