రాష్ట్రప‌తి ఎంపిక‌లో వాజ్‌పేయ్ మార్క్ వ్యూహం

బీజేపీలో ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యానికి తిరుగుండ‌దనే విష‌యం తెలిసిందే!! ఆయ‌న నిర్ణ‌యానికి ఎదురు చెప్పే ప్ర‌య‌త్నం కూడా చేయ‌రు! పార్టీలో కాబట్టి ఇలా మేనేజ్ చేసేస్తున్నారు. మ‌రి మిత్ర‌ప‌క్షాలు కూడా ఆయ‌న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటార‌న్న అభిప్రాయం లేదు! కానీ వాళ్లు కూడా త‌న‌మాటే వినేలా, త‌న మాట‌కు ఎదురు చెప్ప‌కుండా ఉండేలా.. త‌న నిర్ణయ‌మే ఫైన‌ల్ అయ్యేలా పావులు క‌దుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి ఎంపిక‌లో నాడు వాజ్‌పాయ్ అనుస‌రించిన‌ వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు మోదీ! ప్ర‌స్తుతం […]

రాంగ్ రూట్‌లో వెళుతున్న ప‌వ‌న్‌

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నాడు.. అంతిమ లక్ష్యం విజ‌యం కాదు అంటున్నాడు.. సినిమాలు, రాజ‌కీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తానంటున్నాడు!! స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికాడు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! అలా భావించిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. తెగిన గాలిప‌టంటా.. ల‌క్ష్యం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎప్పుడుప్ర‌జ‌ల్లోకి వ‌స్తాడో తెలియ‌దు.. ఎప్పుడు ట్విట‌ర్‌లో స్పందిస్తాడో తెలియ‌దు.. అప్ప‌టిక‌ప్పుడు ఆవేశంగా మాట్లాడి.. త‌ర్వాత సైలెంట్ అయిపోతాడు! మ‌రి ఇటువంటి వైఖ‌రితో రాజ‌కీయాల్లో రాణించగ‌ల‌డా? అనే సందేహాలు […]

టీటీడీ చైర్మ‌న్ రేసులో తెర‌పైకి బీసీ ఎమ్మెల్యే

టీటీడీ చైర్మ‌న్ రేసులో ఏపీలో అధికార టీడీపీ నుంచి రోజుకో కొత్త‌పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. నిన్న‌టి వ‌ర‌కు ఈ పోస్టు రేసులో ఎంపీలు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాగంటి ముర‌ళీమోహ‌న్ పేర్లు బ‌లంగా వినిపించాయి. ఇక ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పేరు సైతం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఇప్పుడు కృష్ణా జిల్లా పెడ‌న ఎమ్మెల్యే, బీసీ నేత‌గా ఉన్న కాగిత వెంక‌ట్రావు పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. బ‌ల‌మైన బీసీ నేత‌గాను, సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న […]

కేసీఆర్ `తెలుగు` సెంటిమెంట్ వెనుక వ్యూహ‌మిదే

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, ప‌రమార్థం ఉంటాయ‌నేది విశ్లేష‌కులకే కాదు క‌నీస రాజ‌కీయ అవ‌గాహ‌న ఉన్న వారికి కూడా సులువుగా అర్థ‌మ‌వుతుంది. ఎప్పుడూ భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయ‌న కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు! ఇప్పుడు అలాంటి నిర్ణ‌యంతో ఏపీలో పాగా వేయాల‌ని చూస్తున్నారు. టీఆర్ఎస్‌ను.. ఏపీలోనూ విస్త‌రించేందుకు ప‌క్కా ప్లాన్‌తో సిద్ధ‌మ‌వుతున్నారు. ప్రాంతీయ పార్టీల హ‌వా న‌డిస్తున్న స‌మ‌యంలో.. వేరే రాష్ట్రానికి చెందిన‌ పార్టీ.. అందులోనూ […]

టీడీపీ వాళ్ల‌నే టార్గెట్ చేస్తోన్న ఏపీ మంత్రి

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ మ‌ధ్య ఆంత‌ర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకి, మున్సిప‌ల్ చైర్మ‌న్ మధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ప్ర‌తి వ్య‌వ‌హారంలోనూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేంత‌గా క‌ల‌హాలు ముదిరిపోయాయి! ప్ర‌తి విష‌యంలోనూ మంత్రి టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేయ‌డాన్ని టీడీపీ శ్రేణులు స‌హించ‌లేక‌పోతున్నాయి. మిత్ర ప‌క్ష‌మ‌యినా.. విప‌క్షంలా వ్య‌వ‌హ‌రిస్తున్నారిన మండిపడుతున్నాయి. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించిన తామే వచ్చే ఎన్నిక‌ల్లో […]

టి-కాంగ్రెస్ `బాహుబ‌లి` వ‌స్తున్నాడా?

అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, విభేదాల‌తో నిండిపోయిన టి-కాంగ్రెస్‌కు కొత్త ర‌క్తం ఎక్కించేందుకు అధిష్టానం పావులు క‌దుపుతోంది. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవ‌డంతో పాటు సీఎం కేసీఆర్‌కు పోటీగా నిలిచే స‌రైన నాయ‌కుడి కోసం వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారించ‌డం మాని.. సీఎం అభ్య‌ర్థిగా నిల‌బ‌డేందుకు టి-కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు వ్యూహాలు ర‌చిస్తున్నారు. దీంతో ఇక పగ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడికి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఉద్య‌మంలో కాంగ్రెస్ త‌ర‌ఫున కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌, ఢిల్లీలోనూ మంచి నాయ‌కుడిగా […]

నాలుగు కొత్త నియోజవర్గాలు … నలుగురు కొత్త ఎమ్మెల్యేలు

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి పేరు చెప్ప‌గానే సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా నిలుస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని అన్ని సీట్ల‌లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేప‌ల్లిగూడెంలో మిత్ర‌ప‌క్షం బీజేపీ)తో క‌లుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే ద‌క్కాయి. రాజ‌కీయంగా జిల్లా ప్ర‌జ‌లు ఎంతో చైత‌న్య‌వంతంగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతున్నాయ‌న్న అంచ‌నాల‌తో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు […]

జ‌న‌సేన‌లో నాగ‌బాబుకు రెండు ఆప్ష‌న్లు..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ కావ‌డంతో జ‌న‌సేన రాజ‌కీయాలు హీటెక్కాయి. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌లో ఏ రోల్ అయినా పోషించేందుకు తాను రెడీగా ఉన్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఇప్ప‌టికే రెండుమూడుసార్లు ఓపెన్‌గానే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాగ‌బాబు ఎంపీగా పోటీ చేయ‌వ‌చ్చ‌నే టాక్ ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం కాపు వ‌ర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ నుంచి […]

న‌టుడు ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య కేసులో కొత్త కోణం

బుల్లితెర నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య కేసులో కొత్త కోణం బ‌య‌ట ప‌డింది. ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డి స్నేహితులు స్పందిస్తున్నారు. ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని… అత‌డి భార్య పావ‌నీరెడ్డితో ప్రొఫైల్ ఫొటోపై జ‌రిగిన గొడ‌వ వ‌ల్లే అత‌డు మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వారు ఆరోపిస్తున్నారు. ప్ర‌దీప్ ఇంట్లో గ‌త మూడు నెల‌లుగా శ్రావ‌ణ్ అనే వ్య‌క్తి ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. అత‌డితో పావ‌నీరెడ్డి స‌న్నిహితంగా ఉన్న ఫోటోను ఆమె ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్టుకుంద‌ని…ఈ విష‌య‌మై […]