కోవిడ్ ను ఎదుర్కోనేంద‌కు కేంద్రం కొత్త కార్యక్రమం

దేశంలో కోవిడ్-19 సంక్రమణ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరూపిత ఆయుర్వేద మూలికా ఔషధం ఆయుష్64, సిద్ధ ఔషధం కబసురా కుడినీర్లను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసుపత్రుల్లో లేని కోవిడ్ రోగులకు వాటిని అందివ్వ‌నున్నారు. ఆ రెండు మందులు సమర్థ‌వంతంగా పనిచేస్తాయని మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్స్ లో రుజువయింది కూడా. ఆయూష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, దశలవారీగా పంపిణీకి సమగ్ర […]

క‌రోనా సాకుతో పెళ్లికి నిరాక‌ర‌ణ‌..! తీరా క‌ట్ చేస్తే..

ఇప్పుడు దేనికైనా క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుగా పెట్టుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘ‌ట‌న అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. మ‌రికొద్ది క్ష‌ణాల్లో జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగ‌డ‌మే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా అధికారులు విచారించ‌గా ఒక్కో విష‌యం బ‌య‌ట‌ప‌డుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్ర‌కారం వ‌ధూవ‌రులు కదిరికి చేరుకోగా పెళ్లి తంతు కొన‌సాగిస్తున్నారు […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతోంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రావణాసుడి పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాగా.. అక్క‌డే రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. […]

క‌రోనాతో భార్య‌.. బ్లేడ్‌తో కోసి హ‌త‌మార్చిన భ‌ర్త‌

క‌రోనా సృష్టిస్తున్న విల‌యం అంతా ఇంతా కాదు. ఒక‌వైపు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా ప్రాణాల‌ను తీస్తుండ‌గా, మ‌రోవైపు మ‌రెన్నో దారుణ సంఘ‌ట‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. కుటుంబ బంధాల‌ను చిద్రం చేస్తున్న‌ది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. క‌రోనా బారిన ప‌డిన భార్య‌ను ఆమె భ‌ర్త దారుణంగా హ‌త్య చేశాడు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. నెల్లూరు జిల్లా కావలి పట్టణం సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధికి చెందిన మల్యాద్రి, […]

త‌మిళుల దెబ్బ‌కు కమల్ కీల‌క నిర్ణ‌యం..?!

మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌.. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగి తొలిసారి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో కమల్‌ను త‌మిళులు ఊహించ‌ని దెబ్బ కొట్టారు. క‌మ‌ల్‌తో స‌హా పార్టీ అభ్య‌ర్థులు త‌మిళ‌నాడులో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]

రోడ్డు ప్ర‌మాదంలో సీఐ దంప‌తులు మృతి

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్ర‌ద్ధ‌, అజాగ్ర‌త్తతో నిండు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు ఢీకొన‌గా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్‌ బజార్‌ సీఐ లక్ష్మణ్‌, ఆయన స‌తీమ‌ణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. సూర్యాపేట జిల్లా […]

పెళ్లికి రెడీ అయిన ఛార్మీ..వ‌రుడు అత‌డేన‌ట‌?

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీ ప్ర‌స్తుతం ఎలాంటి చిత్రాలు చేయ‌క‌పోయినా నిర్మాతగా మాత్రం దూసుకుపోతోంది. అది కూడా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాల‌న్నీ ఛార్మీనే నిర్మిస్తోంది. అలాగే పూరీ టూరింగ్‌టాకీస్‌, పూరీ కనెక్ట్స్ ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలన్నీంటిని ఛార్మి చూసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఛార్మీ పెళ్లి వార్త‌లు ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పెళ్లిపై తనకు […]

`వ‌కీల్ సాబ్‌`గా మారిన స్టార్ హీరో సూర్య‌..ఫొటోలు వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో న‌ల్ల కోటు ధ‌రించి వ‌కీల్ సాబ్‌గా ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా వ‌కీల్ సాబ్‌గా మారాడు. ప్ర‌స్తుతం సూర్య టిజే జ్ఞానవేల్ దర్శక‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మొద‌టి […]

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌య దేర‌వ‌కొండ కీల‌క సూచ‌న‌!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మునుప‌టితో పోలిస్తే మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా వేల మందిని బ‌ల‌తీసుకుంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేకే చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించిన వెంట‌నే కోవిడ్ మందుల కిట్‌ను వాడండ‌ని సూచించారు. […]