ఆ 12 మందితో కేసీర్ కి తలనొప్పే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పేరుకు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 18 మంది వున్నారు. ఇందులో నలుగురైదురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. క్యాబినేట్‌లోని 18 మంది మంత్రుల్లో 12 మంది మంత్రుల తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్న వారు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు […]

చైనా స్టీల్ అమరావతికి వచ్చేస్తోంది!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఆన్‌స్టీల్‌ కంపెనీతో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మిస్తున్న […]

వీళ్ళు పోలీసులా సిగ్గు సిగ్గు!!

యూపీలో దొంగలు.. రౌడీలే కాదు. పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు. వారికి వారే వీధి రౌడీల్లా దర్శనం ఇస్తున్నారు. వాటాలు పంచుకునేందుకు తొలుత చర్చను ప్రారంభించి పొరపొచ్చాలు రావడంతో తన్నుకున్నారు.చుట్టూ అందరు చూస్తున్నారనే సోయి కూడా మరిచి పట్టపగలు తన్నుకున్నారు. లంచాలు పంచుకునే విషయంలోనే ఈ ఘర్షణకు వారు దిగారు. రోడ్డుపైనే పరస్పరం వారు తలపడ్డారు. ఈ సంఘటనపట్ల సామాన్య జనం విస్తుపోతుండగా ఉన్నత పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

బాబ్బాబు ఇంకోసారి రెఫరెండం పెట్టరూ ప్లీజ్!!

తమ దాకా వస్తే కానీ ఏదీ బోధపడదన్నట్టు తయారైంది బ్రిటీష్ సామాన్య ప్రజల గోడు.అందరూ విడిపోదామంటున్నారు కాబట్టి మనం ఒక రాయి వేద్దాం అన్న చందాలో అసలు దేనికి ఓటు వేస్తున్నామో దాని పర్యవసానం ఏంటో తెలీకుండానే సగం మందికి పైగా యూరో జోన్ నుండి విడిపోవడానికి మద్దతుగా ఓటేశారు.తీరా ఫలితాలు వచ్చి పౌండ్ 30 ఏళ్ల వెనక్కి వెళ్లి ఒక్కొక్కరి ఆస్తి నిమిషాల్లో సగానికి కరిగిపోవడంతో బ్రిటిషర్లకి కళ్ళు బైర్లు కమ్మాయి.చేతులు కాలాక ఆకులు పట్టుకున్న […]

రాజమౌళి ఈగ – రవిబాబు పందిపిల్ల

కాదేది కవితలకు అనర్హం అన్నాడో కవి… ఇప్పడు  టాలీవుడ్ లో డైరక్టర్లు ఇదే మాటను వల్లెవేస్తున్నారు. ఈగ…టాలీవుడ్ చేసిన హంగామాను దృష్టిలో పెట్టుకొని… పందిపిల్లకు రెడీ అంటున్నాడు  ద‌ర్శకుడు ర‌విబాబు. అల్లరి, అనసూయ‌, అవును వంటి డిఫరెంట్ కామెడి, ల‌వ్‌, హ‌ర్రర్‌, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల‌ను ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించి డైరెక్టర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మ‌రి కాస్తా డిఫ‌రెంట్‌గా పందిపిల్లపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను […]

సిద్దరామయ్య స్టేజ్ ముద్దు గోల

ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ప్రజలందరూ చూస్తుండగానే..ఓ బహిరంగ సభలో అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ఇవాళ బెంగుళూరులో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య సన్మానించారు. అంతే ఆమె […]

బాహుబలి అక్కడ వర్కౌట్ కాదు-రాజమౌళి

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తం చేసిన మూవీ బాహుబలి. విడుదలైన చోటల్లా బంపర్ హిట్ అవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బాహుబలి గురించి డైరెక్టర్ రాజమౌళి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. బాహుబలికి సినిమాకు పలు అవార్డులు అందుకున్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ముందు విషయాలు వెల్లడించారు. బాహుబలి సినిమాను ఎందుకు నేరుగా హిందీలో తెరకెక్కించలేదన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా స్పందించారు.  ‘బాహుబలి: […]

కాల్ మనీలోచక్రం తిప్పుతున్న ఆ మహిళ ఎవరు?

కాల్‌మనీ కేసులు కొత్త రూట్‌లోకి మళ్లుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కాల్‌మనీ కేసుల్లో నిందితులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు రివర్స్‌లో నిందితులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రత పెరిగి మళ్లీ కాల్‌మనీ కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల క్రమంలో కొత్త లాబీయింగ్ మొదలైంది. అటు పోలీసులకు, ఇటు కాల్‌మనీ నిందితులకు మధ్యే మార్గంగా వారి మధ్య సయోధ్య కుదర్చటానికి ఒక మహిళ రంగంలోకి దిగింది. […]

దావూద్ ఏడ్చిన వేల!!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషాదంలో మునిగిపోయాడు. జాలి, దయ, కరుణ లాంటివేమి లేని దావూద్ లాంటి డాన్ కూడా ఏడుస్తాడా.. అతనికీ విషాద ఘటనలుంటాయా అని అశ్చర్యపోకండి. ఎన్ని మర్డర్లు చేసినా దావూద్ కు కుటుంబ సభ్యులంటే చచ్చేంత ఇష్టం. అందుకు చాలా మందిని తనతోపాటే పాకిస్తాన్ తీసుకెళ్లిపోయాడు. దావూద్ కు ఎంతో ఇష్టమైన అతని చిన్న తమ్ముడు హుమాయున్ కస్కర్ చనిపోయాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న కస్కర్ ఇటీవలే మరణించడంతో దావూద్ ఇంట […]