ప్రియా వారియర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్..ఎన‌ర్జిటిక్ స్టార్‌తో రొమాన్స్‌?

కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ఇటీవ‌లె తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియ‌ర్‌.. త‌న రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో […]

హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో […]

క‌రోనా ఎఫెక్ట్‌..నానికి హ్యాండిచ్చిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే సుందరానికీ!` ఒక‌టి. వివేక్‌ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా షూటింగ్‌ను ఆప‌డం లేదు. త‌క్కువ మంది సిబ్బందితో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ను ఫినిష్ చేసే ప‌నిలో ఉన్నారు నాని. ఇక ఈ చిత్రంలో మళయాలీ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇటీవ‌లె […]

క‌రోనా దెబ్బ..ఓటీటీలోనే వ‌స్తానంటున్న చిరంజీవి అల్లుడు?

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు ఏ సినిమానూ థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. […]

ఇక ఇప్ప‌ట్లో అది జ‌ర‌గ‌న‌ట్టే.. తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లె `వ‌కీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలు ఉండ‌గా.. అందులో హరిహర వీరమల్లు, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ సెట్స్ మీద ఉన్నాయి. మిగతా ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఒప్పుకున్న అన్ని సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్ ఇటీవలె క‌రోనా బారిన ప‌డ్డారు. […]

`ఉప్పెన‌`కు బిగ్ షాక్‌..బుల్లితెర‌పై బోల్తా ప‌డిన వైష్ణ‌వ్‌?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల అయిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా న‌టించింది. 100 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా బ‌ద్ద‌లు కొట్టింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం […]

చిరంజీవి బ‌ర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య‌`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా దెబ్బ‌కు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌డంతో.. విడుద‌ల‌ను వాయిదా వేశారు. […]

బాల‌య్య డైరెక్ట‌ర్‌కి ఫిక్స్ అయిన‌ బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప త‌ర్వాత బ‌న్నీ కొర‌టాల శివ‌తో సినిమా చేస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా కొర‌టాల ఎన్టీఆర్‌తో సినిమా ప్ర‌క‌టించాడు. దీంతో బ‌న్నీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడు అన్న‌ది […]

ర‌ష్మీ కీల‌క నిర్ణ‌యం..ఇక ఈ యాంక‌ర‌మ్మ‌ను అక్క‌డ చూడ‌లేమ‌ట‌?

బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మీ గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది ర‌ష్మీ. ప్ర‌స్తుతం బుల్లితెర లోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే ఈ షోకు రాక‌ముందు ర‌ష్మీ ప‌లు చిత్రాల్లో న‌టించింది. కానీ, అవేమి ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ త‌ర్వాత కూడా ఒక‌టి, రెండు చిత్రాలు చేసింది. అయిన‌ప్ప‌టికీ, వెండితెర‌పై స‌క్సెస్ కాలేక‌పోయింది. దర్శకనిర్మాతలు కూడా […]