నటి రేణూ దేశాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. రేణూ బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. రేణూ దేశాయ్ షేర్ చేసిన ఈ విషయాల ప్రకారం..ఆమె ఇండస్ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయ్యిందని తెలిపారు. అంతేకాకుండా ఆ ఖాతాలోని పూర్తి వివరాలను కూడా వారు చూడగలిగారు. దీంతో తాను షాక్ అయ్యానంటూ ఇన్‌స్టాలో రేణూ వివరాలను షేర్ చేశారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా […]
Category: gossips
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా ఉందా…?
అక్కినేని సమంత తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. ఈ సిరీస్ కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొదటి సీజన్ ప్రేక్షకులను బాగా అలరిచిడంతో… రెండో సీజన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. తొలి సీజన్ ఢిల్లీలోని గ్యాస్ లీక్ ఘటనతో ముగుస్తుంది. ఇక రెండో సీజన్ ముఖ్యంగా శ్రీలంక తమిళులపై ఫోకస్ చేశారు. ఎల్టీఈ ఛాయలు కనిపిస్తుడడంతో పాటు ఇండియా, శ్రీలంక, లండన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శ్రీలంకలో […]
వామ్మో..ఆదిపురుష్ కోసం ప్రభాస్‌కు అంత ఇస్తున్నారా?!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రభాస్ కూడా గట్టిగానే పుచ్చుకుంటున్నారట. ఆదిపురుష్ కోసం […]
దీదీ గూటికి 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?!
ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ భావించినప్పటికీ.. చివరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీనే విజయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ కొట్టింది. 213 స్థానాల్లో టీఎంసీ విజయదుందుభి మోగించగా.. బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే టీఎంసీ గెలుపుతో.. బీజేపీ నేతలు ఎప్పుడెప్పుడు దీదీ గూటికి చేరిపోదామా అని కలవరపడుతున్నారట. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్‌లో చేరాలని భావిస్తున్నారట. బీజేపీ […]
ఎట్టకేలకు అందుకు ఒప్పుకున్నఅనుష్క.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్?!
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బెంగుళూరు భామ.. ప్రస్తుతం జోరు తగ్గించేసింది. ఈమె నుంచి సంవత్సరానికి ఓ సినిమా రావడం కూడా గగనమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అనుష్క. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వంలో అనుష్క ఓ […]
`సర్కారు..` విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన..అసలేమైందంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలోనే మహేష్ ఫ్యాన్స్ […]
చిరు `లూసీఫర్`లో మెగా ప్రిన్స్ కీలక పాత్ర?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ యంగ్ పొలిటీషియన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఈ మధ్య విజయ్ దేవరకొండ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అవి రూమర్లే అని తేలిపోయాయి. అయితే తాజా […]
హీరో రామ్ సినిమాలో మాధవన్..?
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. […]
పెళ్లి విషయం పై స్పందించిన హీరోయిన్..?
సినీ నటి సంజనా గల్రానీ పెళ్లి చేసుకున్న విషయం బయటపెట్టేసింది. నేడు ఈ హీరోయిన్ సంచలన ప్రకటన చేసింది. తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడానని చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని […]









