” శృతిహాసన్ లో ఆ క్వాలిటీ అంటే నాకు చాలా ఇష్టం “… ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్ గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో భాగంగా ప్రభాస్ మరియు ఇతర చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారు. ఇక ఇదే క్రమంలో రాజమౌళి సలార్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ పాత్ర గురించి ప్రభాస్ మాట్లాడుతూ…” ఇదివరకు విడుదలైనటువంటి టీజర్లలో శృతిహాసన్ కేవలం ఒక డైలార్ కి మాత్రమే పరిమితం అవుతూ కనిపించింది. అయితే ఈ సినిమా లో శృతిహాసన్ మొత్తం పెద్దగా ఉండదు అన్న సందేహాలు కూడా అందరికీ ఏర్పడ్డాయి.

కానీ ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. అలాగే రాజమౌళి ఈ విషయంపై స్పందిస్తూ శృతిహాసన్ డాన్స్ చాలా బాగా చేస్తుందని విన్నాను అని చెప్పడంతో… నాకు శృతిహాసన్ డాన్స్ అంటే చాలా ఇష్టం.. అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.