రష్మిక డీప్ ఫేక్ వీడియో పై నలుగురు అరెస్ట్… కానీ పరారీలో అసలు వ్యక్తి…!

రష్మిక మందన ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజుల నుంచి సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో కూడా ఎంతటి దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే. ఏఐ సాయంతో రష్మిక మందన ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ తరువాత వరుసగా ఆలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ల వీడియోలను సైతం మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇక ఈ విషయంపై చాలామంది సినీ ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ స్పందించారు. బాధితులకు సపోర్ట్ గా నిలిచారు. ఇక ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. నిందితులను వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించింది.

రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురుని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురే ఈ వీడియోను అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. అయితే వీల్లే కాకుండా అసలు వ్యక్తి మరొకరు ఉన్నారట. అతను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు.