స్టార్ యాక్టర్‌గా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సముద్రఖనికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తమిళ్ నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన ఇప్పటికే టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం తెలుగులో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా గడుపుతున్న సముద్రఖని ఏ సినిమాలో అయినా డైరెక్టర్గా లేదా నటుడిగా ఉన్నాడంటే అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులంతా భావించే విధంగా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
మనసుకు నచ్చితే తప్ప ఎటువంటి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సముద్రఖనికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ప్రముఖ పొలిటిషన్ బయోపిక్ లో సముద్రఖని నటిస్తున్నాడంటూ సమాచారం. 1987 – 94. 1999 – 2009 మధ్య తెలంగాణ యల్లందు శాసనసభ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నరసయ్య బయోపిక్ లో సముద్రఖనీ నటించబోతున్నాడట. నరసయ్య నమోదుకాని రాజకీయ పార్టీ సిపిఐ పార్టికి చెందినవారు.
యల్లందు నుంచి ఆయన వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రేక్షకులకు ఫేవరెట్ పొలిటిషన్ గా మారాడు. అయితే ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. అవినీతి మచ్చ కైనా లేని ఈ వ్యక్తి పేద ప్రజల అండగా, ఓ గొప్ప మానవతవాదిగా నిలిచాడు. ప్రస్తుతం నరసయ్య లాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్ కి తెలియాలనే ఉద్దేశంతో సముద్రఖని అ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు సినీవర్గాల నుంచి టాక్. ఇదే నిజమైతే సముద్రఖని మరోసారి తన సత్తా చాటుతాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.