ఆ మూవీ లో దిల్‌రాజు ఓ పాట పాడాడని తెలుసా.. ఇంతకీ ఏ మూవీలో అంటే.. ?!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా, డిస్క్రిబేటర్ గా వ్య‌వహ‌రించిన దిల్‌రాజు.. ఆయన ప్రొడ్యూసర్గాచేసిన దాదాపు ప్రతి సినిమాతో సక్సెస్ అందుకొని ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. అయితే గతంలో నాగచైతన్య నటించిన జోష్ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాను చిరంజీవికి చెప్పి రామ్ చరణ్‌తో తీయాలని దిల్‌రాజు భావించాడట.

కానీ చిరంజీవి ఆ మూవీ వర్కౌట్ కాదు అంటూ చెప్పడంతో ఎలాగైనా ఈ సినిమాని తెరకెక్కించాలని పట్టుబట్టి నాగార్జునను ఒప్పించి నాగచైతన్యతో ఈ సినిమాను తీశాడు. వాసు వార్మ‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ రాలేదు. కానీ మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటి యూత్ కి ఈ సినిమాలోని పాటలు ఫేవరెట్ గా నిలిచాయి. వాటిలో ఒక పాటను దిల్‌రాజు పాడాడని చాలామందికి తెలిసి ఉండదు. అయితే ప్రస్తుతం దిల్‌రాజు పాడిన ఆ పాట నెట్టింట వైరల్ గా మారింది.

రాఘవేంద్ర చేసిన ఓ షోలో దిల్ రాజు ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు. జోష్‌ సినిమాలో.. జెడి చక్రవర్తి ఎంట్రీ తో వచ్చే అన్నయ్య వచ్చినాడు.. అంటూ దిల్‌రాజు అల‌పించాడ‌ట‌. మామూలుగా తనకు హమ్మింగ్ చేయడం, పాట ట్యూన్ కు తగ్గట్టు లిరిక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం తన సినిమాలన్నింటికీ ఉండే అలవాటని.. చెప్పుకొచ్చాడు దిల్‌రాజు ఈ విషయం తెలిసిన నెటిజ‌న్స్ రాజు బ‌య్యా నీలో ఈ స్పెష‌ల్ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.