బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతి మనందరికీ సుపరిచితమే. ఈ షో తో తన అందాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. క్రేజీ ఆఫర్లను కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో వాసంతి ఎంగేజ్మెంట్ సైతం జరిగింది.
డిసెంబర్ 7న జరిగిన ఈ కార్యక్రమానికి బిగ్ బాస్, బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. వాసంతి పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తి. వారిద్దరూ గత కొద్దికాలం నుంచి ప్రేమించుకుంటూ ప్రస్తుతంపెద్దల అంగీకారంతో ఒకటవ్వడానికి సిద్ధమయ్యారు. ఇక ఈమె పెళ్లి చేసుకోబోయే పవన్ సైతం ఇప్పటికే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన వాసంతి.. తన ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా తిరుపతిలోనే ఘనంగా చేసుకుంది. ఇక ఈమె ఎంగేజ్మెంట్ కి ఈమె తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈమె ఎంగేజ్మెంట్ వేడుక చూసిన ప్రేక్షకులు…” గట్టి సౌండ్ పార్టీ నే పట్టింది గా..” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram