టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా అదే క్రేజ్‌తో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అయితే అనారోగ్య కారణాలవల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఇక తన ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళింది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ న్యూయార్క్ వెళ్ళిందంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇంతకీ అసలైన కారణం తెలియదు. ఇక తాజాగా అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సమంత దానికి మానవ సంబంధాలపై ఒక లైన్ రాసుకోవచ్చింది. ఈ భూమ్మీద ఉన్న జీవులన్నిటికీ ఒకదానితో ఒకటికి సంబంధం ఉంటుంది. మన చేతులు గబ్బిలం రెక్కలలా ఉంటాయి. మన కణాలు పైనాపిల్ కణాలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది.
మన డిఎన్ఎ పుట్టగొడుగులతో సంబంధాలు ఉంటాయని.. ప్రతి ఒక్కరితో మరొకరికి సంబంధం ఉంటుంది కాకపోతే అది కొంచెం దగ్గర లేదా దూరం బంధం అంతే అంటూ వివరించింది. అందరం ఒకే కణం నుంచి వచ్చిన వాళ్ళం అని సమంత ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
View this post on Instagram