” సలార్ ” రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ ఒపీనియన్ ఇదే..!

2023వ ఏడాది వసూళ్లు పరంగా సంచలనం సృష్టించిన సినిమాలలో ” సలార్ ” ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో కి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక హైదరాబాదులో ఈరోజు కూడా ఈ మూవీకు బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి.

ఈవారం విడుదలైన కొత్త సినిమాల కంటే సలార్ మూవీ బెటర్ బుకింగ్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ద్వారా ప్రభాస్ పాపులారిటీ పది రెట్లు పెరిగిందనే చెప్పాలి. తాజాగా సలార్ మూవీ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్‌ స్పందించాడు. ఈయన మాట్లాడుతూ.‌..” సలార్ మూవీకి పాజిటివ్ టాక్ రావడం, కలెక్షన్ల విషయంలో కూడా ప్రభాస్ సంతోషంగా ఉన్నాడు.

కానీ నేను మాత్రం ఇంకా మెరుగ్గా ఉంటే బాగున్ను అని ఫీల్ అయ్యాను. సలార్ విషయంలో నూటికి నూరు శాతం సంతోషం లేకపోయినా.. దేవ రోల్ విషయంలో సంతృప్తితో ఉన్నాను. సలార్ శౌర్యాంగపర్వం భారీ లెవెల్ లో ఉంటుంది ” అని తెలిపారు ప్రశాంత్ నీల్. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి‌.