రవితేజ ” వెంకీ ” మూవీ రీ రిలీజ్ కి థియేటర్స్ లో మారుమోగుతున్న రెస్పాన్స్… ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంది అంటున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ లో స్టార్ట్ అయినటువంటి రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో మార్మోగుతుందో మనందరికీ తెలిసిందే. కొత్త సినిమా స్టోరీని తీసి తెరకెక్కిస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ఓ సినిమాని రీ రిలీజ్ చేస్తుంటే కూడా అదే వసూళ్లు వస్తున్నాయి.

ఇక దీంతో ప్రతి ఒక్కరూ తమ సూపర్ హిట్ సినిమాలను రి రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది మొదలుపెట్టినటువంటి ఈ ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగింది. ఇక ఈ ఏడాది ఎండింగ్ అవుతున్న సమయంలో రవితేజ ” వెంకీ ” మూవీని రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

మాస్ మహారాజ్ కెరీర్లో ఒక వింటేజ్ క్లాసిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ కూడా ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. ఇక ఈ సినిమాలోని బ్రహ్మానందం ఎంట్రీ కానీ రవితేజ కామెడీ కి థియేటర్లలో రెస్పాన్స్ దద్దరిల్లుతోందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.