గుంటూరు కారం ‘ కూర్చి మడత పెట్టి ‘ సాంగ్ కు ఈ తాతకి.. థ‌మ‌న్‌ రెమ్యూనరేషన్ ఇచ్చాడా.. ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు నుంచి సినిమా రిలీజై ఏడాదిన‌ర్ర కావ‌టంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని మ‌హేష్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్‌ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల గుంటూరు కారం మూవీ నుంచి కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ పాటకు మహేష్, శ్రీలీల ఊర మాస స్టెప్పులతో చిందేసి ఆకట్టుకున్నారు. మరోవైపు ఈ సాంగ్ పై భారీ ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఈ పాటను ఓ డైలాగ్ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎలక్షన్ టైం లో కాలా పాషా అనే వృద్ధుడు కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ తో ఫుల్ పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా కేసీఆర్ పై కూడా సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశాడు. కొద్ది రోజులు పలు మీడియా ఛానళ్లకు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తు సందడి చేసిన కాలా పాషా డైలాగుని ఇప్పుడు గుంటూరు కారం సాంగ్‌లో వాడాడు థ‌మన్. ఇక తాజాగా దీనిపై స్పందించిన కాలాపాషా ఇంట్ర‌స్టింగ్‌ కామెంట్ చేశాడు.

మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్ పాటగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఛాన్స్ వస్తే మహేష్ తో కలిసి ఒక్క స్టెప్ అయినా వేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పాటలో నా డైలాగ్‌ను వాడుతున్నట్లుగా ముందే మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ నాతో చెప్పారని.. అంతే కాదు ఆయన నాకు కాస్త ఆర్థిక సాయం కూడా చేశాడంట చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటలో ఆయన డైలాగ్ వాడినందుకు ఏకంగా లక్ష రూపాయల వరకు కుర్చీ తాతకు రెమ్యూనరేషన్ ఇచ్చాడట. ప్రస్తుతం కాలపాషా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు.