” బాలయ్య 109 ” మూవీ షూటింగ్లో జాయిన్ అయిన పవర్ఫుల్ విలన్..!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే ” భగవంత్ కేసరి ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య హీరోగా టాలెంటెడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ” బాలయ్య 109వ ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బాలయ్య వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియల్ విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ వార్తని ఈయన కన్ఫర్మ్ కూడా చేశారు. తాజాగా బాబీ డియోల్ ” యానిమల్ ” సినిమాలో నటించి మంచి ఫేమస్ అయినా సంగతి తెలిసిందే.

ఇక దీంతో బాలయ్య సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక లేటెస్ట్ గా ఈయన ” బాలయ్య 109వ ” సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై లేటెస్ట్గా కొన్ని పిక్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రేజీ ఫేస్ ఆఫ్ ఏ లెవెల్ లో ఉండబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.