కట్టి వందల ఏళ్ళైనా చెక్కుచెదరని చైనా వాల్.. రీసెర్చ్ లు ఏం చెబుతున్నాయి అంటే..?

చైనా వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని గురించి అందరూ హిస్టరీ బుక్స్‌లో చదువుకునే ఉంటారు. ప్రపంచంలో ఏడు వింతల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఒకటి. అత్యంత పొడవైన ఈ గోడ గురించి తెలియని వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈ చైనా వాల్‌ మొత్తం పొడవు 8850 కిలోమీటర్ల పొడ‌వు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో కట్టడం ప్రారంభించి.. 16వ శతాబ్దానికి పూర్తి చేశారు.

ఈ గోడ ఎంత పాతదో ఎన్ని దశాబ్దాలు నాటిదో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇలా వందల ఏళ్ల నుంచి ఈ గోడ ఏమాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అయితే ఇది ఇప్పటికీ ఇలాగే నిలబడి ఉండడానికి కారణం ఏంటని మన శాస్త్రవేత్తలంతా చాలా రీసెర్చ్ లు చేశారు. తాజాగా అందిన నివేదిక ప్రకారం చైనా, అమెరికా, స్పైన్ పరిశోధకులు రీసెర్చ్ ద్వారా కొన్ని విషయాలు బయటపెట్టారు.

సాధారణంగా ఏదైనా పురాతన గోడలు అంటే కచ్చితంగా లైకెన్లు, బ్యాక్టీరియా, శిలీంద్రాలు, నాచు అలానే చిన్న మొక్కలు ఉపరితలాలపై పెరుగుతాయి. వీటితో గోడ పాడైపోతుంది. అయితే అలాంటి ఇబ్బందులు ఏవి చైనా వాల్‌కు కలగవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 600 కిలోమీటర్ల మేర పొడవు ఉన్న ఈ గోడలో చాలా పురాతనమైన విభాగాల్లో నేల మీద బయోగ్రస్ట్‌లు కనిపించాయని.. ఇవి పురాతన నిర్మాణాల సంరక్షణకు దోహదం చేస్తాయని రీసర్చ్‌లు చెబుతున్నాయి.