స్టార్ డం రాగానే ప్రియుడిని మార్చేసిన యానిమల్ బోల్డ్ బ్యూటీ… ఇదేం రూల్ రా బాబు…!

” యానిమల్ ” మూవీలో 15 నిమిషాల పాత్రలో కనిపించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది త్రిప్తి దిమ్రీ. ఇన్స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ సైతం దక్కించుకుంది. అయితే ఈ భామ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మతో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం నుంచి ఓ వార్త వైరల్ అవుతుంది.

కానీ వీరిద్దరూ విడిపోయారని… ప్రస్తుతం మోడల్ అండ్ బిజినెస్ మాన్ సామ్ మర్చెంట్ తో ప్రమాణం నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య ఓ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరైన ఈ ముద్దుగుమ్మ… ఆయనతో కలిసి క్లోజ్ గా ఫోటోలు దిగడంతో ఈ రూమర్ మొదలైనట్లు తెలుస్తుంది.

సామ్ మర్చెంట్ గోవాలోని వాటర్స్ బీచ్ లాడ్జ్ అండ్ గ్రీన్ ఫౌండర్.. కాగా సోషల్ మీడియాలో దిశా పఠనీ, టైగర్ ష్రాఫ్ లాంటి సెలబ్రిటీస్ ఈయన ఫాలోవర్స్ గా ఉన్నారు. 2002 గ్లాడ్ రాగ్స్ మ్యాన్ హంట్ కాంటెస్ట్ విన్నర్గా నిలిచిన సామ్.. తర్వాత వ్యాపార రంగంలోకి షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది.