సురేష్ కొండేటిని ప్రెస్ మీట్ నుంచి బ్యాన్… నిజా నిజాలు ఇవే…!

ప్రముఖ సినిమా జర్నలిస్ట్.. ” సంతోషం ” మ్యాగజైన్ యజమాని నరేష్ కొండేటి మనందరికీ సుపరిచితమే. మూవీ ప్రమోషన్స్ మీటింగ్లలో పిచ్చ పిచ్చ ప్రశ్నలు అడుగుతూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు సురేష్ కొండేటి. కొంతమంది ఇతను ఎక్కడ ప్రశ్నలు అడుగుతాడా అని ప్రమోషన్స్ కి కూడా రావడం మానేశారు. ఇక మరికొందరు మాత్రం ప్రశ్నలకు కౌంటర్ వేస్తూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేవారు.

ఇక ఈ మధ్యకాలంలో సురేష్ కొండేటి మీద ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే… ఈనని ప్రెస్ మీట్ నుంచి బ్యాన్ చేసినట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్మాణం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అదంతా తప్పుడు ప్రచారం అని.. ఈ విషయాన్ని సురేష్ కొండేటి కొట్టి పడేస్తూ తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

తనపై జరుగుతున్న ప్రచారం పై ఈయన ఎక్స్ ద్వారా స్పందించాడు. ” నేను తెలుగు సినీ ప్రెస్ మీట్ కు హాజరవ్వకుండా బ్యాన్ చేశారంటూ కొందరు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. నన్ను ఎవరు బ్యాన్ చేయలేదు. ప్రస్తుతం తీర్థయాత్రలలో ఉన్నాను. మళ్లీ హ్యాపీగా ప్రెస్ మీట్ కి వస్తా. 31 ఏళ్ల నుంచి జర్నలిస్టుగా ఉన్న.. ఇక ముందు కూడా ఉంటా ” అంటూ రాసుకు వచ్చాడు సురేష్ కొండేటి. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.