సంయుక్త మీనన్ మనందరికీ సుపరిచితమే. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో… వరుస అవకాశాలు వచ్చాయి.
మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి కళ్యాణ్ రామ్ సరసన ” డెవిల్ ” మూవీలో నటిస్తుంది. ఇక తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సంయుక్త స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
పక్కన మాళవిక నాయర్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీ హైలెట్ కావడం గమనార్హం. ఉల్లిపొర లాంటి చీరలో కుర్రాళ్లకు అందాల విందు చేసింది. ఈమె అందం చూసి ఆడవాళ్లు సైతం అసూయ పడ్డారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన డెవిల్ మూవీ ఈనెల 29న గ్రాండ్గా రిలీజ్ కానుంది.