క‌ర్నాట‌క‌లో కుమ్మి ప‌డేసిన స‌లార్‌…. ప్ర‌భాస్ ఏంటి సామీ అరాచ‌కం…!

పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన.. తాజాగా ” సలార్ ” అనే మూవీతో ప్రేక్షకులం ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.

అలాగే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన గౌడ ఫోటోగ్రఫీ అందించారు. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలని ఓ ఊపు ఊపుతుంది సలార్. ఇక ఈ మూవీ కర్ణాటకలో కూడా అదరగొడుతుందని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ ట్రెండ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ కర్ణాటకలో ఫస్ట్ డే రూ.9 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక కర్ణాటకలో తెలుగు సినిమాలకు మంచి రేంజ్ లో కలెక్షన్స్ వస్తుంటాయి. కాగా ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ డైరెక్టర్ కాబట్టి అక్కడ వారికి ఈ సినిమా బీభత్సంగా నచ్చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.