అతనితో వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన రష్మిక మందన.. ఏంజ‌రిగిందంటే..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. ఇక పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈమెకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులలో ప్రమోద్ భాస్కర్ కూడా ఒకరు. ఈమె సినిమాలకు ఈయన ఓ వీర అభిమాని. సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు రష్మికకి ప్రపోజ్ కూడా చేశాడు.

ఇక వీటికి చాలా ఫన్నీగా రష్మిక సైతం రిప్లై ఇస్తుంది. ఇక తాజాగా ఆయనతో రష్మిక వీడియో కాల్ మాట్లాడి అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఇదంతా కూడా బిగ్ బి అమితాబచ్చన్ సమక్షంలో జరిగింది. అమితా బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి షోలో భాగంగా జరిగింది. ఈ షోలో ప్రమోద్ పాల్గొన్నాడు. ఈ క్రమంగా తన మనసులో మాటని అమితాబచ్చన్ తో పంచుకున్నాడు. ఈయన మాట్లాడుతూ..‌” రష్మిక అంటే నాకు చాలా ఇష్టం. తన సినిమాలను చూస్తూ ఉంటాను. తనకి చాలా సార్లు ప్రపోజ్ కూడా చేశాను ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అమితాబచ్చన్ వెంటనే రష్మికకు వీడియో కాల్ చేశారు. ప్రమోద్ తో రష్మికని మాట్లాడించారు. ఫోన్ కాల్ లో భాగంగా మిమ్మల్ని పర్సనల్గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ చెప్పాడు. దానికి రష్మిక స్పందిస్తూ తప్పకుండా కలుస్తానని చెప్పింది. అలాగే ఈ షోలో నా అభిమాని పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ రష్మిక వెల్లడించింది. ఇక ఈ క్రమంలోనే అమితాబచ్చన్.. రష్మికపై ప్రశంసల వర్షం కురిపించాడు. రష్మిక నటించిన ప్రతి సినిమాను చూస్తానని.. తాజాగా నువ్వు నటించిన యానిమల్ మూవీ కూడా ఎంతో బాగుంది అంటూ అమితాబ్ పొగిడాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.