రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సాలిడ్ డ్రామా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీలో ప్రభాస్ చేసిన పాత్ర దేవాని ఎంత పవర్ఫుల్ గా చూపించాడు అనేది రెండు ట్రైలర్స్ లో ఓ రేంజ్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. అయితే అసలు దేవా క్యారెక్టరైజేషన్ పై ప్రశాంత్ నిల్ ఇంట్రెస్టింగ్ లైన్ ని చెప్పాడు.
ప్రభాస్ ముఖం లో ఒక అమాయకత్వం ఉంటుంది అని అది తనలోని ఒక పసి కోణాన్ని చూపిస్తుంది.. అలాగే ఒక సింహాన్ని కూడా చూపిస్తుంది అని ఇదే కోవాలో సలార్ లోని తాను చేసిన దేవా కూడా. ” అవసరమైతే కాళ్లు పట్టుకోవడం లేదంటే తల కూడా నరుకుతాడు ” అని సింపుల్ లైన్ లో చెప్పాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.