స‌లార్ పై మెగాస్టార్ పూన‌కాలు తెప్పించే మాస్ రివ్యూ..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే విజయవంతమైన టాక్ ని అందుకుంది ఈ మూవీ. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్‌ చేస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఆల్రెడీ యూనానిమస్ టాక్ రాగా ఈ మూవీపై అనేకమంది సినీ సెలబ్రిటీలు తమ రివ్యూలను ఇచ్చారు.

ఇక ఇదే క్రమంలో లేటెస్ట్గా ఈ మూవీపై లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు. ఈయన ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” డియర్ ‘ దేవా ‘ ప్రభాస్ కి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సలార్ సిజ్ ఫైర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను నిర్మించిన ప్రపంచానికి కుడోస్. అలాగే పృద్వి, శృతిహాసన్, జగపతిబాబు మరియు మిగతా టీం సభ్యులు అంతా సినిమాలో అదరగొట్టారు ” అంటూ మెగాస్టార్ రివ్యూ ఇచ్చారు. ఇక ఇంతటి స్టార్ హీరో నుంచే రివ్యూ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.