వావ్.. మొదటి సినిమా సక్సెస్ తోనే ఏకంగా 30 వేల మ్యారేజ్ ప్రపోసల్స్ అందుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా హృతిక్ రోషన్ అంటే తెలియని వారు ఉండరు. తన అందం, అభినయంతో ఎంతమంది కుర్రాళ్లను ఫిదా చేసిన హృతిక్ రోషన్ ని మొదటి సినిమాలో చూసే చాలామంది అమ్మాయిలు మ్యారేజ్ ప్రపోజ్ చేశారని టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక హృతిక్ మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత కహునా ప్యార్ హై అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కేవలం ఈ ఒక్క సినిమాకి హృతిక్ రోషన్‌కు చాలా మంది అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారు. అంతేకాదు మొదటి సినిమాతోనే హృతిక్‌కి దాదాపు 30 వేల పెళ్లి ప్రపోజల్ వచ్చాయని తెలుస్తోంది. అయితే హృతిక్ రోషన్ 12 ఏళ్ళ వయసు నుంచే నటుడు సంజయ్ ఖాన్ కూతురు సుస్స‌నే ఖాన్‌తో మంచి స్నేహం గా ఉండేవారు.

అలా వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొదట్లో వీళ్ళు ప్రేమను ఒకరితో ఒకరు బయట పెట్టుకోకపోయినా.. పెళ్లి చేసుకునే నాలుగు సంవత్సరాల ముందు ప్రేమ విషయాన్ని చెప్పుకున్నారు. ఇక 20 డిసెంబర్ 2000 లో హృతిక్ రోషన్ ఆమెను వివాహం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటూ ప్రేమించి.. పెళ్లి చేసుకున్న ఈ జంట ఏవో మనస్పర్ధలతో 2013 లో లీగల్ గా విడిపోయారు.