బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్బజ్ ఖాన్ – మలైకా అరోరాకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అర్భాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ సురా ఖాన్‌ను మూడో వివాహం చేసుకోవడంతో ఇప్పుడు మలైకా విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల దానిపై స్పందించిన మలైకా తాజాగా తన రెండో వివాహం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలైక రెండో పెళ్లికి రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మలైకా ఝలకతిక లాజ సీజన్ 11 కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
ఈ షోలో భాగంగా పారా ఖాన్ పెళ్లి గురించి మలైకాను ప్రశ్నించగా.. సింగిల్ పేరెంట్ నుంచి డబుల్ గా మారుతున్నారా అని ఫారా ప్రశ్నించింది. దానికి స్పందిస్తూ నేను మరొకరిని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నా అంటూ మలైక వివరించింది. దీనికి ఫారీ మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించింది. దీనికి మలైకా స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చేసింది. ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే నేను రెడీ.. నా దగ్గరకు వచ్చి పెళ్లి ప్రపోజ్ చేయాలి అని వివరించింది.
ఆమె ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నటుడు అర్బాజ్ ఖాన్‌తో 2017 లో విడాకులు తీసుకున్న మలైకా తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చాలాకాలం డేటింగ్ చేసింది. అయితే మలైకా – అర్జున్ మధ్య వయసు గ్యాప్ కారణంగా ఈ జంట భారీ ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. మలైకా ఎప్పుడు ఏదో న్యూస్ తో వార్తలో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే అర్జున్ – మలైకా వివాహం గురించి ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మలైక పెళ్లి గురించి చేసిన కామెంట్స్ సెన్సేషన్‌గా మారాయి.