బేబీ సైలెన్స్ వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా.. అమ్మడు మహాముదురే.. ?!

2023లో సెన్సేషన్ క్రియేట్‌ చేసిన సినిమాల్లో బేబీ ఒకటి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో ప్రముఖ యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో వరుస అవకాశాలను అందుకుంటు ఫుల్ బిజీగా గడుపుతుంది అని అందరూ భావించారు. అయితే వైష్ణవి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలైనా రిలీజ్ అవ్వాలి కానీ.. వైష్ణవి ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు.

స్లో అండ్ స్టడీ అన్నట్లుగా వైష్ణవి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఇప్పటివరకు కేవలం దిల్ రాజు బ్యానర్ లో మాత్రమే ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. ఒకటి ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న లవ్ మీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. మరో రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ కే వరుసగా మూడు సినిమాలు సైన్ చేసి ఇతర బ్యానర్లో అవకాశాలు వచ్చినా.. సైన్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైష్ణవి చైతన్య కేవలం దిల్ రాజు సినిమాలకు మాత్రమే సైన్ చేస్తే సైలెంట్ గా ఉండడానికి వెనుక మాస్టర్ ప్లాన్ ఉందట. ఆశిష్ తో న‌టిస్తున్న‌ వైష్ణవి.. ఆ మూవీ హిట్ టాక్‌ సంపాదిస్తే.. ఈ సినిమా తర్వాత మరింత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయవచ్చు అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె ఇతర ఏ బ్యానర్లో సినిమాలకు ఓకే చేయడం లేదట. అయితే ప్రస్తుతం వైష్ణవి చైతన్య నుంచి ఓ సినిమా వస్తే చాలని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆశిష్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమా సక్సెస్ అయితే వైష్ణవి చైతన్య మార్కెట్ మరింత పెరుగుతుందని ఎటువంటి సందేహం లేదు.