పురాతన కాలం నుంచి చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయని దిష్టి కాయగా వేలాడదీస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇంట్లోకి, ఇంట్లోని వ్యక్తులకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని వారు నమ్ముతారు. అయితే ఓ ఇంటి గుమ్మంలో కట్టే ఈ గుమ్మడికాయ సాధారణంగా దివ్య ఔషధంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. చాలామంది గుమ్మడికాయను తినడానికి కూడా ఇష్టపడరు. కానీ దీన్ని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనిషి శరీరాన్ని చల్లబరిచేందుకు సహకరిస్తుంది.
మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ తో పోలిస్తే అలో తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్స్ ను బుడిద గుమ్మడికాయ అందిస్తుంది. దిష్టికాయ కాదు దివ్య ఔషధం అంటూ నిపుణులు దీన్ని వర్ణిస్తున్నారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలావరకు కెమికల్స్ వాడే ఉత్పన్నమవుతున్నాయి. ఆరోగ్యానికి మేలు చేస్తే ఆహార పదార్థాలు ఎక్కడో కొన్ని ఉన్నప్పటికీ వాటిని మన ఆహారంగా తీసుకోవటంలేదు. దీనికి తోడు గుమ్మడికాయ అంటేనే దిష్టి తీసే వస్తువుగా భావిస్తున్నారు. బూడిద గుమ్మడికాయలు తినడం వల్ల కాలేయం, కిడ్నీలను శుభ్రపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో విటమిన్ సి, కెరెట్టిన్, విటమిన్ బి12, మెగ్నీషియం, విటమిన్ సి, జింక్, కాల్షియం, కార్బోహైడ్రేట్ ప్రోటీన్లతో పాటు ఎన్నో రకాల ఫైబర్స్ సమృద్ధిగా ఉంటాయు. దీన్ని తినడం వల్ల ఈ పైన ఇచ్చిన పోషకాలు అన్ని సరీరానికి తగ్గిన మోతాదులో లభిస్తాయి. ఈ పోషకాలు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి, టైప్ 2 డయాబెటిస్ ను నివారించడానికి కూడా సహకరిస్తాయి. నిత్యం ఆహారంలో బూడిద గుమ్మడికాయ చేర్చడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చు. గుమ్మడికాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరుగుతారని చింత అవసరం లేదు.
100 గ్రాముల గుమ్మడికాయని తీసుకుంటే కేవలం 13 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ కూడా దీనిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనే వారికి కూడా ఇది మంచి ఆహారం. ఇక గుమ్మడికాయను తినడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అట్జిమర్స్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఇక బూడిద గుమ్మడి సాలాడ్, జ్యూస్, కూరలు, సూప్‌లు, స్మూతీలు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలలో చేర్చుకోవచ్చు. బూడిద గుమ్మడికాయతో హల్వా లేదా తీపి గుమ్మడి కూర వడియాలు.. అలాగే ప్రసిద్ధి చెందిన పేట స్వీట్స్ ఇలా అనేక రకాల ఆహార పదార్థాలు చేసి ఇతర ప్రదేశాల్లో తీసుకుంటూ ఉంటారు.