జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులని దక్కించుకున్నాడు తారక్. ఇక ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా లెవెల్ లో ” దేవర ” అనే మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా… జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇంతకుముందు కొరటాల శివకి ఆచార్య అనే ఒక భారీ డిజాస్టర్ రావడంతో ఈ దేవరా సినిమా పైన కొంతమంది ప్రేక్షకులు నెగిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఈ మూవీపై నెగిటివ్ టాక్ భారీగా స్ప్రెడ్ అవుతుంది. ఇక ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనే దానిపై దేవర టీం ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఈ సినిమాకి హిట్ అయ్యే అంత రేంజ్ లేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వీరి కామెంట్స్ పై సినిమా పెద్దలు మండిపడుతున్నారు. మూవీ చూడకముందే ఫ్లాప్ అని మీరు ఎలా చెప్పగలరు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక వీరంతా ఎన్టీఆర్ మీద కోపంతోనే ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ కి కొరటాల ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి మరి.