ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యా.. తాత చెప్పిందే నిజమైంది.. నాగచైతన్య

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవల నటించిన వెబ్ సిరీస్ దూత. ఇక నిన్న మొన‌టి వ‌ర‌కు వరుస
ఫ్లాపుల‌ను ఎదుర్కొన్న నాగచైతన్యకు ఈ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ దక్కింది. తనలోని ఒక కొత్త యాంగిల్ ని ఆవిష్కరించిన నాగచైతన్య ఈ సిరీస్ కు హైలెట్ గా నిలిచాడు. ఇటీవల రిలీజ్ అయిన దూత భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ కు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు ద‌క్కాయి. ముఖ్యంగా నాగచైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. కొడుకుని అలాంటి పాత్రలో చూసిన నాగచైతన్య కూడా షాక్ అయ్యారు.

నిజంగా చైతు ఇలా నటించాడు.. అంటే నమ్మలేకపోతున్న అంటూ కామెంట్స్ చేశాడు. చైతన్య లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడని నేను ఇప్పుడే తెలుసుకున్న అంటూ నాగార్జున వివరించాడు. ఇక చైతు కెరీర్‌లోనే ఫస్ట్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన దూత అంతా గొప్ప పేరు తెచ్చుకోవడం తో నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంకా 2,3 భాగాలు కూడా ఎపిసోడ్స్ వైస్ గా రానున్నాయి. వాటిని తప్పకుండా విక్రమ్ చైతన్య తోనే ముందుకు తీసుకువెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక ఓ ఇవెంట్‌లో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ నా జీవితం ఇలా ఉంటుందని నేను అసలు ఏమాత్రం ఊహించలేదు అంటూ వివరించాడు.

చైతు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలనుకునే వాడట.. చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వడమే లక్ష్యంగా ఉన్న చైతు పెద్దయ్యాక ఏమవుతావని ఎవరు అడిగినా ఇంజనీర్ అనే చెప్పేవాడట. కానీ ఆ విషయంలో నేను గోరంగా ఫెలయ్యా తాత చెప్పింది నిజమైంది అంటూ చైతూ చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జున‌కు.. ఏఎన్ఆర్ మొదటి నుంచి చైతన్య నటుడ‌వుతాడ‌ని చెప్తూ వచ్చాడట. ఏది ఏమైనా ఆ విషయంలో నేను అనుకున్నట్లు కాకుండా తాత చెప్పిందే నిజమైంది. నిజంగా నేను ఓ నటుడిగా ఇంత మంచి పేరు తెచ్చుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ నాగచైతన్య గుర్తు చేసుకున్నాడు.