ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్…తారక్ ఫ్యాన్స్ కి సంక్రాంతి ముందే వచ్చేసింది గా…!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న మూవీ ” దేవర “. ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసిన ఎన్టీఆర్ .. ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ అనంతరం ” వార్ 2 ” డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరో పక్క ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది.

ఇక వీరిద్దరి కాంబో ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ ప్లాన్ చేయనున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి నాలుగవ వారం తర్వాత ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

2025 సమ్మర్ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందట. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించబోతుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి నటీనటులు ఎంపిక కాలేదు. ఇక ప్రస్తుతం ఈ అప్డేట్ చూసిన తారక్ ఫ్యాన్స్… సంక్రాంతి ముందే వచ్చేసినట్లు ఉంది… అంటూ కామెంట్లు చేస్తున్నారు.