చిరంజీవి వల్ల నేను అలా నష్టపోయా.. అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి విలన్ రోల్ నుంచి హీరో అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోగా పాపులర్ అయ్యాడు. మెగాస్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక చిరు తర్వాత మెగా బ్యాక్ గ్రౌండ్ తో చాలామంది స్టార్ హీరోస్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్‌ దక్కించుకొని పాన్ ఇండియా లెవెల్లో పాపులార్ అయిన‌ సంగతి తెలిసిందే.

కాగా అల్లు అర్జున్.. చిరంజీవి కారణంగా గతంలో కొంత డబ్బు నష్టపోయానంటూ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అదెలా.. అసలు ఏం జరిగిందో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మెగాస్టార్ డ్యాన్స్ కారణంగా 25 వేల రూపాయలను పోగొట్టుకున్నాడట. చిరు డ్యాన్స్ గురించి.. ఆయన బాడీలో ఉన్న గ్రేస్ గురించి అంద‌రికి తెలుసు. ఇంద్ర సినిమా టైంలో బన్నీకి తన ఫ్రెండ్ కి మధ్య ఓ చిన్న చర్చ జరిగిందట. దాయి దాయి దామా సాంగ్లో చిరంజీవి వీణ‌ స్టెప్ వేసేటప్పుడు ఆయన పక్కన సోనాలి బింద్రే ఉంటుందని స్నేహితుడు చెప్పాడ‌ట.

బన్నీ మాత్రం లేదు బాస్ ఒక్కరే డ్యాన్స్ వేస్తారు అంటూ మొండిగా వాదించడంతోపాటు దీనిపై 25 వేల బెట్ కూడా వేసాడట. కానీ ఆఖరికి వీడియో చూస్తే చిరు పక్కన సోనాలి బింద్రే కూడా డాన్స్ వేసింది. అప్పుడు తన స్నేహితుడి దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పిందే నిజమే అని కామ్‌గా పాతికవేలు అతనికి ఇచ్చేసి వచ్చేసాడట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. కానీ పక్కన హీరోయిన్ ఉన్న‌ ఆమె వైపు కూడా నా చూపు వెళ్ళ‌కుండా చిరంజీవి గారి డ్యాన్స్ మాత్రమే చూశా అంటూ వివరించారట. ఇలా మెగాస్టార్ కారణంగా ఐకాన్ స్టార్ పాతికవేల రూపాయలు పోగొట్టుకున్నారు.